Liquor Scam: తెలంగాణ పాలిటిక్స్‌లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు.. కవిత టార్గెట్‌గా విపక్షాల కామెంట్స్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈడీ ఛార్జ్‌షీట్‌తో మళ్లీ ఒక్కసారిగా హైవోల్టేజ్ పాలిటిక్స్ మొదలయ్యాయి. విమర్శలు, కౌంటర్లతో మ్యాటర్ హీటెక్కింది. అటు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు కవిత.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈడీ ఛార్జ్‌షీట్‌తో మళ్లీ ఒక్కసారిగా హైవోల్టేజ్ పాలిటిక్స్ మొదలయ్యాయి. విమర్శలు, కౌంటర్లతో మ్యాటర్ హీటెక్కింది. అటు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు కవిత. ఈడీ విచారణను డైలీ సీరియల్‌తో పోల్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరు పేరుని ప్రస్తావించింది ఈడీ. లేటెస్ట్‌గా సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరు ప్రముఖంగా ఉండటం పొలిటికల్‌గా పెద్ద దుమారమే రేపుతోంది. ఇక ఇదే స్కాంలో ఈనెల 11న కవితను ప్రశ్నించింది సీబీఐ. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు ఎమ్మెల్సీ కవిత. ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న అంశాలు.. చేసిన ఆరోపణలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణ టీవీ సీరియల్‌ను తలపిస్తోందని విమర్శించారు కవిత. ఇవాళ నిజామాబాద్‌లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆమె ఏం మాట్లాడుతారు? ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉంటే.. ఈడీ ఛార్జ్‌షీట్‌ను బేస్‌చేసుకొని బిఆర్ఎస్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది బీజేపీ. స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేకపోతే..ఆధారాలు ఎందుకు ధ్వసం చేశారని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇక మంగళవారం నాడు సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ సమావేశంపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు కమలనాథులు. లిక్కర్ కేసు నుంచి కవితను ఎలా బయటపడేయాలనే అంశంపైనే ఈ మీటింగ్‌లో చర్చ జరిగిందని ఆరోపించారు.
లిక్కర్ స్కామ్‌పై బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్స్ వార్ నడిచింది. కవిత లిక్కర్ క్వీన్, ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరు 28 సార్లు ఉందంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘అన్నా తొందరపడకు, మాట జారకు. 28 సార్లు కాదు.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదు’ అంటూ రిప్లై ఇచ్చారు కవిత. ఇక నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాంలో ఉన్నది నిజం.. జైలుకి వెళ్లడం ఖాయమంటూ కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌కు సైతం ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు కవిత.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
