BRS vs BJP: ఛార్జ్ షీట్ లో కవిత పేరు.. బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం..
ఛార్జ్ షీట్ లో కవిత పేరు.. ఈ విషయంపై పెను దుమారమే చెలరేగుతోంది. బీఆర్ఎస్ బీజేపీ ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం. సవాళ్లు ప్రతిసవాళ్లు.. ట్వీట్లూ హీట్లూ నడుస్తున్నాయ్. ఇదంతా బీజేపీ ఆడుతోన్న..
ఛార్జ్ షీట్ లో కవిత పేరు.. ఈ విషయంపై పెను దుమారమే చెలరేగుతోంది. బీఆర్ఎస్ బీజేపీ ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం. సవాళ్లు ప్రతిసవాళ్లు.. ట్వీట్లూ హీట్లూ నడుస్తున్నాయ్. ఇదంతా బీజేపీ ఆడుతోన్న ఒక పొలిటికల్ గేమ్ గా కొట్టి పారేస్తోంది బీఆర్ఎస్. ఇదే అంశంపై బీజేపీ కౌంటరేంటి? బీఆర్ఎస్ రివర్స్ అటాక్ ఎలాంటిది?
ఛార్జ్ షీట్ దర్యాప్తు చేశాక ఇచ్చే రిపోర్టు. ఇందులో ఈడీ, సీబీఐ, పోలీస్ కి తేడా లేదు. ఎవరు దర్యాప్తు చేసినా.. ఆ తర్వాత రూపొందించే వివరాల సారాంశమే ఛార్జ్ షీట్. ఇప్పటికే కవిత పేరు ఛార్జ్ షీట్ లో పలుమార్లు వచ్చింది కాబట్టి.. ఆమెకు ఈ కేసులో డీప్ రిలేషనుంది. వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ కి ఇచ్చారు. లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇవన్నీ తేలాకే.. కవిత పేరు ఇందులోకి వచ్చిందనీ, ఏమీ లేకుండా ఆమె పేరు ఛార్జ్ షీట్ లో ఎక్కే ప్రసక్తే లేదంటుంది బీజేపీ.
ఇందులో తమ పార్టీ కుట్ర లేనే లేదంటారు బీజేపీ నాయకులు. అతుల్ అరోరా ఎవరో తమకు తెలీదనీ అంటున్నారు. అతని కన్ఫెక్షన్ స్టేట్మెంట్ లో కవిత పేరొచ్చిందనీ, విజయ్ నాయర్, మహేంద్రు, ఎంఎస్ రెడ్డి, వీరితో పాటు కవిత పేరు కూడా బయటకు వచ్చిందనీ, ఒబెరాయ్ హోటల్ కి వెళ్లారని అంటున్నారు. 91 సెల్ ఫోన్లతో పాటు లాప్ టాప్ ధ్వంసం చేశారని, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ విషయాలు అని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చాక కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందనే తాము అనుకుంటున్నామనీ, కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరిస్తున్నారు కమలనాథులు. కరెప్షన్ ఎక్కడున్నా ఖండించి తీరాల్సిందేననీ.. జాతీయ స్థాయిలో మీరు పార్టీ పెట్టడం మాత్రమే కాదు.. మీ కరెప్షన్ కూడా అంతే స్థాయిలో దేశమంతటా వెళ్లిందనీ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ లీడర్లు.
అవినీతి ఎక్కడ ఎలా జరిగినా సరే ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందేననీ. బీఆర్ఎస్ పాలసీ కూడా ఇదేనంటున్నారీ పార్టీ లీడర్లు. ఇది ముమ్మాటికీ బీజేపీ కుట్రేనంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. కవిత రెబల్ గా మారి పార్టీ నుంచి బయటకు రాలేదన్న అక్కసుతోనే ఆమెను ఈ కేసులో ఇరికించారని. ఆ మాటకొస్తే డబ్బులిచ్చిన వారి పేర్లున్నట్టే.. లిక్కర్ పాలసీ మేకర్లు, డబ్బు తీస్కున్న వారి పేర్లు ఎందుకులేవని నిలదీస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు.
ఛార్జ్ షీట్ లో పేరుండగానే నిందితులైపోరనీ. ఇలాంటి ఎన్నో కేసులు వీగిపోయాయనీ. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్రగా వర్ణిస్తోంది బీఆర్ఎస్.. ఇందులో కవిత ఇన్వాల్వ్ మెంట్ ఉంది కాబట్టే.. ఆమె పేరు ఇన్నిసార్లు ఛార్జ్ షీట్ లో వస్తోందనీ అంటున్నారు బీజేపీ నాయకులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..