Corona: వణికిస్తున్న వేరియంట్లు.. కలవరపెడుతున్న కరోనా.. భారత్ లో లాక్ డౌన్ కు దారి తీస్తుందా..?..
ఇన్నాళ్లు దేశంలో ప్రశాంతంగా ఉన్న కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకు పడుతోంది. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని, కనీస సౌకర్యాలు...
ఇన్నాళ్లు దేశంలో ప్రశాంతంగా ఉన్న కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకు పడుతోంది. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని, కనీస సౌకర్యాలు పాటించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం బీఎఫ్ -7 వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అదుపులోనే ఉండగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొవిడ్ జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులు వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే చైనా, జపాన్.. ఇలా వివిధ దేశాల్లో పెరుగుతున్న దేశాలు, అక్కడి పరిస్థితులు చూసుకుంటే మనదేశంలోనూ లాక్ డౌన్ వంటి పరిస్థితి వస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే.. కరోనా ముప్పు పెరుగుతోందనేది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్థరణ పరీక్షలు, చికిత్స, నిఘాను పెంచాల్సిన అవసరం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీనియర్ వైద్యుడు డాక్టర్ అనిల్ గోయల్ వెల్లడించారు.
మూడు డోసుల టీకా తీసుకున్నా అందరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి. 95శాతం మందికి టీకాలు వేసిన చైనా కంటే.. భారత్ ప్రజల రోగనిరోధక శక్తి బలంగా ఉంది. జాగ్రత్తలు తీసుకుంటే దేశంలో లాక్‌డౌన్‌లాంటి పరిస్థితి ఉండదు. చైనా సహా ఇతరదేశాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలకు టీకాలు వేయకపోవడం, నాణ్యమైన వ్యాక్సిన్ లేకపోవడం ప్రధాన కారణం. భారత్‌లో ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలు చాలా వరకు టీకాలు తీసుకున్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. టీకాలు తీసుకోని వారు వెంటనే వేయించుకోవాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అలర్ట్ గా ఉండాలి.
– కరోనా వ్యాప్తి నియంత్రణకు నిపుణుల సూచనలు
కరోనా ప్రారంభంలో విధించిన మొదటి, రెండో లాక్ డౌన్ లతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్లారా చూశాం. వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడం, వ్యాధి సోకిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం, దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం.. ఇవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. సో.. అలాంటి సిట్యువేషన్ మళ్లీ రాకుండా ఉండాలంటే.. జాగ్రత్తలు పాటించడం ఒక్కటే ఏకైక మార్గం. వ్యాధి వచ్చాక ఇబ్బంది పడటం కంటే.. రాకుండా అలర్ట్ గా ఉండటం మంచిది కదా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..