Coronavirus: చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? కరోనా వైరస్‌ లక్షణాలు అయ్యుండొచ్చు..

ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న కరోనా కేసులు మళ్లీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రజలు కరోనా నిబంధనలను పాటించాల్సిన..

Coronavirus: చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? కరోనా వైరస్‌ లక్షణాలు అయ్యుండొచ్చు..
Corona Virus
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 23, 2022 | 2:38 PM

ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న కరోనా కేసులు మళ్లీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రజలు కరోనా నిబంధనలను పాటించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇదిలా ఉంటే కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే నిపుణులు అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి మాత్రమే కాదని, ఇది మూత్రపిండాలు, గుండెతో పాటు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.

తాజా పరిశోధనలో తేలిన అంశాల ప్రకారం కరోనా సోకిన వారి చర్మంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో చేసిన పరిశోధనలో శరీరంపై చిన్న దద్దుర్లు కూడా కోవిడ్‌కు సంకేతమని తెలిపింది. పరిశోధనల్లో శరీరంపై దద్దుర్లు కరోనాకు సంకేతమని తేలింది. కరోనా బారిన పడిన సుమారు 3 లక్షల మందిని విచారించగా వారిలో 9 శాతం మందికి చర్మ సంబంధిత సమస్యలు ఉన్నట్లు తేలింది. వీరిలో 6.8 శాతం మందికి శరీరంపై దద్దుర్లు ఉన్నాయని పరిశోధనతో తేలింది.

కరోనా సోకిన వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, అలసట, తలనొప్పి, రుచి, వాసన వంటి సమస్యలే ఎక్కువ ప్రస్తావిస్తారు కానీ చర్మ సమస్యలను పెద్దగా పట్టించుకోరు. కరోనా సోకిన వారిలో స్కిన్ రాష్, కోవిడ్ రాష్, ఎగ్జిమా, పాపులర్ రాష్, వెసిక్యులర్ రాష్, దద్దుర్లు, పిట్రియాసిస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాలి వేళ్లు ఉబ్బి, గులాబీ, ఎరుపు రంగులోకి మారితే కరోనా ప్రభావమేనని అంచనాకు రావాలి. అదేవిధంగా మెడ, ఛాతీలపై తామర లక్షణాలు, పెదవులు, నోటిపై దద్దుర్లలతో పాటు కొన్నిసార్లు నోటి పూత కూడా కరోనా లక్షణాలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..