Hypothyroidism: ఈ సింపుల్‌ టిప్స్‌తో థైరాయిడ్‌ను నియంత్రించండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

Hypothyroidism: మహిళలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకసారి ఈవ్యాధి వస్తే ఎక్కువమంది దీర్ఘకాలంగా దీంతో పోరాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే తీవ్రత తక్కువుగా ఉంటుంది. థైరాయిడ్ తీవ్రత ఎక్కువుగా ఉంటే మాత్రం గొంతుకు సంబంధించిన సమస్యలతో ఎన్నో..

Hypothyroidism: ఈ సింపుల్‌ టిప్స్‌తో థైరాయిడ్‌ను నియంత్రించండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
Hypothyroidism
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 23, 2022 | 1:55 PM

Hypothyroidism: మహిళలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకసారి ఈవ్యాధి వస్తే ఎక్కువమంది దీర్ఘకాలంగా దీంతో పోరాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే తీవ్రత తక్కువుగా ఉంటుంది. థైరాయిడ్ తీవ్రత ఎక్కువుగా ఉంటే మాత్రం గొంతుకు సంబంధించిన సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మన కంఠం వద్ద సీతాకోకచిలుక ఆకారంలో ఒక ముఖ్యమైన అవయవం ఉంటుంది. దీనిని థైరాయిడ్ గ్రంథి అంటారు. శారీరక ఎదుగుదలలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు శరీరంలోని ప్రతికణం పైనా ప్రభావం చూపిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉంటే అది శరీరంలో ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ కారకాల వల్ల ఈ గ్రంథిలో సమస్యలు ఏర్పడుతాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా థైరాయిడ్ సమస్యలు సంభవిస్తాయి. ఫలితంగా శరీరంంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన మలబద్ధకం, బరువు పెరగడం లేదా వేగంగా బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవటం, విపరీతమైన అలసట వంటి లక్షణాలు ఉంటాయి. థైరాయిడ్ అసమతుల్యత వల్ల కలిగే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్. ఎన్ని మందులు వాడిన తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. ఈ థైరాయిడ్ సమస్య స్త్రీలలో నెలసరి క్రమాన్ని కూడా అస్తవ్యస్తం చేస్తుంది. ఈదశలో రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవటం ద్వారా థైరాయిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రోజూవారి దినచర్య

థైరాయిడ్ తో బాధపడుతున్నవారు రోజువారీ లైఫ్ స్టైల్ లో చిన్ని చిన్న మార్పులు చేసుకోవాలి. ఉదయం లేచిన నుంచి రాత్రిమ పడుకునే వరకు ఆరోగ్యకరమైన ప్రణాళికను రెడీ చేసుకోవాలి. ప్రతిరోజు దీనిని ఫాలో అవ్వాలి.

పేగులకు హాని కలిగించే ఆహారాలకు దూరంగా

పేగుకు హాని కలిగించే ఆహార పదార్థాలను తినకూడదు. పేగును శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాన్నే స్వీకరిచాలి. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడే పెరుగు ఇతర ప్రోబయోటిక్స్ ఆహారంగా తీసుకోవాలి. ఎక్కువుగా తినడాన్ని తగ్గించుకోవాలి. తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని రోజూ వారి డైట్ లో తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

రాత్రి నిర్ణీత సమయం నిద్రపోవాలి

సర్వ రోగాలు నిద్రతో నయం అవుతా అంటారు. మన శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర ఎంతో ప్రధానం. కాబట్టి రాత్రి సమయంలో నిర్ణీత సమయం నిద్రపోవాలి. నిద్రలేవటానికే కాదు, నిద్రపోవటానికి కూడా అలారం సెట్ చేసుకోవాలి.

మంట కలిగించే ఆహారం తీసుకోవద్దు: శరీరంలో వేడి, మంట కలిగించే ఆహారం తినడం తగ్గించాలి. గ్లూటెన్, డైరీ, సోయా కలిగిన ఆహారాలు. బాగా శుద్ధి చేసిన ఆహారాలు తీసుకోకపోవటమే మంచిది. అలాగే, వైట్ బ్రెడ్ , బేకరీ పేస్ట్రీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండేవి తీసుకోకూడదు.

మనసును నియంత్రణ

ఒత్తిడి, ఆందోళనలు ఏ రకంగానూ థైరాయిడ్ పేషెంట్లకు మంచిది కాదు. మనసులో ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దీనికోసం మెడిటేషన్ చేయడం మంచిది. కొద్ది సేపు వాకింగ్ చేయడం ఆరోగ్యకరం. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. తద్వారా మానసిక స్థితి, ఏకాగ్రత మెరుగుపడతాయి. హాయిగా నిద్ర పోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!