Skin Care Tips: చలికాలంలో చర్మసమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..
చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణలో మనం ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. లేకపోతే చలికాలంలో వచ్చే చర్మ సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా
చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణలో మనం ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. లేకపోతే చలికాలంలో వచ్చే చర్మ సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా మారి మనల్ని బాధించవచ్చు. శీతాకాలంలో సున్నితమైన ముఖ చర్మం తన మెరుపును కోల్పోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు మన జీవిన విధానంలో కొన్ని మార్పులను ముఖ్యంగా.. కురగాయలను లేదా తినే ఆహారంలో కొన్ని రకాల మార్పులను చేయడమే పరిష్కార మార్గం.
చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం తదితర వ్యాధులు మనకు అంటుకుంటాయి. ఇవి మన చర్మంపై, జుట్టుపై, ముఖ్యంగా పెదవులపై ప్రభావం చూపుతాయి. అందుకే చలికాలంలో కూడా ఎక్కువ నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. చలికాలంలో చర్మసంరక్షణ కోసం మనకు ఉపకరించే ఐదు రకాల ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
1. క్యారెట్లు : క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి ఇంకా చర్మాన్ని బలోపేతం చేయడానికి ఈ పోషకాలు సహాయపడతాయి. లోపలి నుంచి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. క్యారెట్లను సలాడ్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
2. బచ్చలికూర: పాలకూర ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్యం, పొడిబారడం, డార్క్ స్పాట్స్ నుంచి కూడా బచ్చలికూర మనల్ని రక్షిస్తుంది. బచ్చలి కూరను సబ్జీ, పరాటా, స్మూత్నీ, పల్యా రూపంలో కూడా తీసుకోవచ్చు.
3. దానిమ్మ: దానిమ్మ మన చర్మంపై యాంటీమైక్రోబయల్ ప్రభావాన్ని చూపుతుంది. ఇది మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. జిడ్డు చర్మాన్ని నియంత్రించడంలో దానిమ్మ ఉపకరిస్తుంది.
4. ఆరెంజ్: ఆరెంజ్ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల వీటిని చలికాలంలో నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది.
5. పియర్స్: బేరిపండ్లలో విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడం ద్వారా చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..