RCB IPL 2023 Auction: స్టార్ ప్లేయర్లకు దూరంగా ఉండబోతున్న రాయల్ చాలెంజర్స్.. ఆ ఇద్దరిపైనే దృష్టి పెట్టిన ఫ్రాంచైజీ.. ఎందుకంటే..?

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Dec 23, 2022 | 9:12 AM

ఇప్పటి వరకు ఒక్క సీజన్‌లో కూడా ట్రోఫీని గెలవని ఆర్సీబీ పరిస్థితి ఈ సీజన్‌లో కూడా ఆగమ్యగోచరంగానే మారుతుందేమోనని ఆ టీమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్ 2023 మినీ వేలం కోసం ఆ టీమ్ వద్ద కేవలం రూ. 8.75 కోట్లు మాత్రమే..

RCB IPL 2023 Auction: స్టార్ ప్లేయర్లకు దూరంగా ఉండబోతున్న రాయల్ చాలెంజర్స్.. ఆ ఇద్దరిపైనే దృష్టి పెట్టిన ఫ్రాంచైజీ.. ఎందుకంటే..?
Royal Challengers Bangalore

ఐపీఎల్ 2023 కోసం అన్ని జట్లకు సంబంధించిన ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు(డిసెంబర్ 23) కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 మినీ వేలం జరగబోతుంది. ఇక ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ట్రోఫీకి దూరంగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి అయినా కప్ గెలుచుకోవాలనే ఆశతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మినీ వేలానికి సంసిద్ధమవుతోంది ఆర్సీబీ. అయితే ఇప్పటి వరకు ఒక్క సీజన్‌లో కూడా ట్రోఫీని గెలవని ఆర్సీబీ పరిస్థితి ఈ సీజన్‌లో కూడా ఆగమ్యగోచరంగానే మారుతుందేమోనని ఆ టీమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

ఐపీఎల్ 2023 మినీ వేలం కోసం ఆ టీమ్ వద్ద కేవలం రూ. 8.75 కోట్లు మాత్రమే ఉండడం అందుకు ప్రధాన కారణం. ఈ తక్కువ మొత్తంతోనే ఆ టీమ్ 9 మంది ప్లేయర్లను కొనుగోలు చేయవలసిన ఉంది. ఇక వారిలో 7 స్లాట్లు స్వదేశీ, 2 విదేశీయుల కోసం ఉన్నాయి. ఈ క్రమంలో ఆ టీమ్ స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయలేకపోవచ్చు. స్టార్ ప్లేయర్ల కోసం కనీసం 2,3 కోట్లు వెచ్చించడం తప్పనిసరి పరిస్థితి అయినందున ఆర్సీబీ ఫ్రాంచైజీ ఏ విధంగా నెట్టుకొస్తుందోనని సర్వత్రా ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

స్టార్ ప్లేయర్ల కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటాపోటీ..

అయితే 2022 ప్రారంభంలో జరిగన మెగా వేలంలో ఆర్సీబీ జట్టు కొంత మంది ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లించింది. ఆ కారణంగానే ఇప్పుడు ఆ టీమ్ వద్ద డబ్బులు లేకుండా పోయాయి. ఈసారి 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆర్సీబీకి.. స్టార్ ప్లేయర్ల కోసం ఇతర ఫ్రాంచైజీల నుంచి గట్టి పోటీ ఎదురవనుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధికంగా రూ.42.25 కోట్లు, పంజాబ్ కింగ్స్ దగ్గర రూ. 32.2 కోట్లు, ఇంకా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల వద్ద రూ. 20 కోట్లకు పైగా పర్స్ వాల్యూ ఉంది. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్స్ ఆటగాళ్లు ఆర్‌సీబీకి దక్కడం అనుమానమే.

ఇవి కూడా చదవండి

వారిపైనే ఆర్సీబీ దృష్టి..?

ముఖ్యంగా విదేశీ ఆటగాళ్ల విషయంలో ఆర్సీబీకి గట్టి పోటీ ఎదురవనుంది. ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉన్న ఆర్సీబీ ఒక్క ఆటగాడి కోసం ఎక్కువ ఖర్చు చేస్తే తర్వాత బిడ్డింగ్ లెక్కలు కష్టతరంగా మారిపోనున్నాయి. అయితే ఆర్సీబీ ఈ సీజన్‌లో బౌలర్లపై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తోంది. మొదటిగా ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్‌ను తమ శిబిరంలో చేర్చుకోవాలనుకుంటుదన్న ప్రచారం సాగుతోంది. వేలంలో పార్నెల్ బేస్ ధర రూ.75 లక్షలు మాత్రమే కావడం ఆర్సీబీ లెక్కలకు కలిసొచ్చే విషయం. రూ. 2 కోట్ల బేస్ ధర ప్రకటించుకున్న ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను కూడా దక్కించుకోవాలని ఆర్సీబీ కోరుకుంటుంది.

ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు..

ఫాఫ్ డు ప్లెసిస్ (సీ), షాబాజ్ అహ్మద్, ఫిన్ అలెన్, ఆకాష్ దీప్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, దినేష్ కార్తీక్, సిద్ధార్థ్ కౌల్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, హర్షల్ పటేల్, రజత్ పాటిదార్, సుయాష్ ప్రభుదేశాయ్, అనుజ్ ప్రభుదేశాయ్ శర్మ, మహ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu