Mayank Agarwal IPL 2023 Auction: పంజాబ్ వద్దంది.. హైదరాబాద్ రమ్మంది.. మయాంక్ ప్రైజ్ ఎంతంటే?

Mayank Agarwal Auction Price : పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కు మినీ వేలంలో మంచి ధర లభించింది. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆటగాడి కోసం హోరాహోరీగా పోటీపడగా..

Mayank Agarwal IPL 2023 Auction: పంజాబ్ వద్దంది.. హైదరాబాద్ రమ్మంది.. మయాంక్ ప్రైజ్ ఎంతంటే?
Mayank Agarwal
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 23, 2022 | 3:52 PM

Mayank Agarwal Auction Price : పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కు మినీ వేలంలో మంచి ధర లభించింది. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆటగాడి కోసం హోరాహోరీగా పోటీపడగా.. అనూహ్యంగా సన్‌రైజర్స్ బిడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రూ. 8 కోట్ల వరకు తీసుకెళ్లి.. చివరిగా రూ. 8. 25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మయాంక్ అగర్వాల్ దక్కించుకుంది.

ఇదిలా ఉంటే.. రాహుల్‌తో పాటు గత రెండు సీజన్లలోనూ పంజాబ్‌కు టాప్ రన్ గెట్టర్‌గా నిలిచాడు మయాంక్ అగర్వాల్. ఇక ఈ ఏడాది రాహుల్ స్థానంలో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్.. టోర్నమెంట్ చివరికి ఆ జట్టును ఫైనల్ చేర్చలేకపోయాడు. అందుకే మినీ వేలానికి ముందు పంజాబ్ ఫ్రాంచైజీ అతడ్ని వదులుకుంది. ఇక హైదరాబాద్ మయాంక్‌ను వేలంలో అందిపుచ్చుకుంది.

కాగా, మయాంక్ అగర్వాల్ ఐపీఎల్‌ కెరీర్ విషయానికొస్తే.. 113 మ్యాచ్‌లు ఆడి 2331 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

మయాంక్ అగర్వాల్ క్రికెట్ కెరీర్..

దేశీయ క్రికెట్ రికార్డులు..

14 అక్టోబర్ 2010న, అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవాపై తన T20I అరంగేట్రం చేశాడు. ఇక్కడ అగర్వాల్ 42 బంతుల్లో 52 పరుగులు చేశాడు.

23 ఫిబ్రవరి 2012న విజయ్ హజారే ట్రోఫీలో తెలంగాణపై తన లిస్ట్-ఎ అరంగేట్రం చేశాడు. 7 నవంబర్ 2013న, అతను రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌పై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.

నవంబర్ 2017లో, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి ట్రిపుల్ సెంచరీని సాధించాడు, అతను 2017–18 రంజీ ట్రోఫీలో మహారాష్ట్రకు వ్యతిరేకంగా కర్ణాటక తరపున 304 పరుగులు చేసి నాటౌట్ చేశాడు.

మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్..

26 డిసెంబర్ 2018న అగర్వాల్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 76 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు.

5 ఫిబ్రవరి 2020న అగర్వాల్ న్యూజిలాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేశాడు. ఇక్కడ అగర్వాల్ 31 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మొత్తంగా 5 వన్డేలు ఆడిన అగర్వాల్ 86 పరుగులు చేశాడు.

టెస్ట్ కెరీర్..

ఇక టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన అగర్వాల్.. మొత్తం 21 టెస్టులు ఆడి 1488 పరుగులు సాధించాడు.

మయాంక్ అగర్వాల్ IPL వేలంలో పొందిన ప్రైజ్ వివరాలు..

సంవత్సరం  వేలం ధర జట్టు
2018 రూ. 1 కోటి పంజాబ్
2019 రూ. 1 కోటి పంజాబ్
2020 రూ. 1 కోటి పంజాబ్
2021 రూ. 1 కోటి పంజాబ్
2022 రూ. 12 కోట్లు పంజాబ్

IPL గణాంకాలు..

సంవత్సరం  మ్యాచ్‌లు  పరుగులు
2011 8 141
2012 16 225
2013 5 67
2014 8 115
2015 10 213
2016 3 27
2017 3 26
2018 11 120
2019 13 332
2020 11 424
2021 12 441

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!