IPL 2023 Mini Auction: మరి కొద్ది గంటల్లో ఐపీఎల్ మినీ వేలం.. 87 స్లాట్ల కోసం 405 మంది ప్లేయర్ల మధ్య పోటాపోటీ.. పూర్తి వివరాలివే..

క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మరో విధంగా చెప్పుకోవాలంటే వరల్డ్ కప్‌కు ఉన్నంత క్రేజ్ ఈ లీగ్‌ సొంతం. 2008 నుంచి జరుగుతున్న ఐపీఎల్ ఇప్పటి వరకు 15 సీజన్లను పూర్తిచేసుకొని..

IPL 2023 Mini Auction: మరి కొద్ది గంటల్లో ఐపీఎల్ మినీ వేలం.. 87 స్లాట్ల కోసం 405 మంది ప్లేయర్ల మధ్య పోటాపోటీ.. పూర్తి వివరాలివే..
Ipl 2023 Mini Auction
Follow us

|

Updated on: Dec 23, 2022 | 8:18 AM

క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మరో విధంగా చెప్పుకోవాలంటే వరల్డ్ కప్‌కు ఉన్నంత క్రేజ్ ఈ లీగ్‌ సొంతం. 2008 నుంచి జరుగుతున్న ఐపీఎల్ ఇప్పటి వరకు 15 సీజన్లను పూర్తిచేసుకొని వచ్చే ఏడాది జరగబోయే 16 సీజన్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. కొచ్చిలోని బోల్గట్టి ద్వీపంలోన గ్రాండ్ హయత్ హోటల్ వేదికగా ఈ రోజు(డిసెంబర్ 23) మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాలకు ఈ వేలం ప్రారంభమవుతుంది. ఇక ఈ మినీ వేలంలో మొత్తం ఫ్రాంచైజీలు పాల్గొని తమ జట్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకుంటాయి. ఇప్పటికే 163 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆయా ఫ్రాంచైజీలు మొత్తం 87 స్లాట్ల కోసం ఈ వేలం నిర్వహించనున్నారు.

అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ టోర్నీగా ప్రసిద్ధికెక్కిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్ట్రీమింగ్, టీవీ హక్కులు ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో 6.2 బిల్లియన్ డాలర్లకు అమ్ముడయ్యాయి. వీటిలో స్ట్రీమింగ్ హక్కులను 2027 వరకు Viacom18 3.5 బిల్లియన్ డాలర్లకు  పొందింది. డిస్నీ యాజమాన్యంలోని స్టార్ ఇండియా టీవీ కాంట్రాక్ట్‌ను 3.02 బిలియన్ డాలర్లకు తన సొంతం చేసుకుంది. కాగా ఈ రోజు జరగబోయే  ఐపీఎల్ 2023 మినీ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు ఉండగా వారి కోసం 87 స్లాట్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా వీరిలోనే 30 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉంటారు. మరి ఈ మిని వేలాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

IPL 2023 మినీ వేలం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023  మినీ వేలం కొచ్చిలోనిబోల్గట్టి ద్వీపంలోన గ్రాండ్ హయత్ హోటల్ వేదికగా ఈ రోజు(డిసెంబర్ 23) మధ్యాహ్నం 2: 30 నిముషాలకు జరుగుతుంది.

IPL 2023 మినీ వేలం ఏయే టీవీ ఛానెల్‌లు ప్రసారం చేస్తాయి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023  మినీ వేలం ‘స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్’లో ప్రసారం అవుతుంది. అలాగే ప్రత్యక్ష ప్రసారాన్ని జీయో సినిమా యాప్‌లో కూడా చూడవచ్చు.

ఆయా ఫ్రాంచైజీల వద్ద మిగిలి ఉన్న పర్స్ వాల్యూ, స్లాట్‌ల సంఖ్య

  1. 2008 నుంచి ఇప్పటి వరకు జరిగిన 15 సీజన్లలో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ వద్ద రూ 20.55 కోట్లు ఉన్నాయి. ఆ జట్టులో 9 స్లాట్‌ల భర్తీకి ఈ రోజు వేలం జరగనుండగా వీరిలో 3 స్లాట్‌లు ఓవర్సీస్(విదేశీ) ప్లేయర్ల కోసం కేటాయించినవి.
  2. మహింద్ర సింగ్ ధోని సారథ్యంలో నాలుగు సీజన్లలో ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ 20.45 కోట్లు ఉన్నాయి. ఇక ఈ జట్టులో 7 స్లాట్లు ఖాళీలు ఉండగా,  విదేశీ ప్లేయర్ల కోసం రెండు స్థానాలు ఉన్నాయి.
  3. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ 19.45 కోట్లు ఉండగా 5 స్థానాల కోసం మినీ వేలం జరగనుంది. ఇక వీటిలో 2 స్థానాలు విదేశీ ప్లేయర్ల కోసం కేటాయించినవి.
  4. ఐపీఎల్ తొలి సీజన్‌(2008)లోనే టోర్నీ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ వద్ద 13.2 కోట్లు ఉన్నాయి. ఇక ఈ జట్టులో 9 స్లాట్ల కోసం వేలం జరగనుండగా వీటిలో 4 స్థానాలలో విదేశీ ఆటగాళ్లు ఉంటారు.
  5. ఇటీవలే ఐపీఎల్‌లోకి ప్రవేశించిన లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ 23.35 కోట్ల పర్స్ వాల్యూ ఉండగా మొత్తం 10 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇక వీటిలోనే 4 స్లాట్లు విదేశీ ప్లేయర్ల కోసం ఉన్నాయి.
  6. కోహ్లీ నేతృత్వంలోనే ఎక్కువ కాలం నడిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద కేవలం రూ 8.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ జట్టులో 7 స్లాట్లు ఖాళీగా ఉండగా, వాటిలో 2 స్లాట్లు ఓవర్సీస్ ప్లేయర్లవి.
  7. ఐపీఎల్ 2022 సీజన్ 15లోనే తొలి టోర్నీ ఆడిన గుజరాత్ టైటాన్స్ మొదటి సీజన్లోనే విజేతగా నిలిచింది. ఇక ఈ జట్టు వద్ద రూ. 19.25 కోట్లు ఉండగా 7 స్లాట్లు కోసం మినీ వేలం జరగనుంది. ఇక ఈ 7 స్లాట్లలో 2 ఓవర్సీస్ ప్లేయర్ల కోసం కేటాయించినవి.
  8. ఇప్పటి వరకు రెండు సీజన్లలో(2012, 20140 ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం రూ. 7.05 కోట్లు మాత్రమే పర్స్ వాల్యూగా ఉంది. ఇక ఈ టీమ్‌లో 11 స్లాట్లు ఖాళీలు ఉన్నాయి. వాటిలో 3 ఓవర్సీస్ ప్లేయర్లకు ఉన్నాయి.
  9. పంజాబ్ కింగ్స్ వద్ద రూ 32.2 కోట్లు ఉండగా మూడు ఓవర్సీస్ స్థానాలతో మొత్తం 9 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
  10. ఐపీల్ 2016 లో సీజన్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధికంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి. ఇక ఈ టీమ్‌లో 4 ఓవర్సీస్ స్థానాలతో సహా మొత్తం 13 స్లాట్లు ఉన్నాయి.
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.