AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus Vaccine: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయం.. ఆ టీకాను బూస్టర్‌ డోసుగా వాడేందుకు అనుమతించాలని వినతి..

కోవిడ్ కొత్త వేరియంట్ బిఎఫ్‌-7 ప్రపంచాన్ని మరోసారి భయపెడుతోంది. తీవ్రత తక్కువుగా ఉండే ఛాన్స్ ఉన్నప్పటికి.. వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ నియంత్రణకు అన్ని దేశాలు..

Corona Virus Vaccine: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయం.. ఆ టీకాను బూస్టర్‌ డోసుగా వాడేందుకు అనుమతించాలని వినతి..
Covid Vaccine
Amarnadh Daneti
|

Updated on: Dec 23, 2022 | 8:49 AM

Share

కోవిడ్ కొత్త వేరియంట్ బిఎఫ్‌-7 ప్రపంచాన్ని మరోసారి భయపెడుతోంది. తీవ్రత తక్కువుగా ఉండే ఛాన్స్ ఉన్నప్పటికి.. వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ నియంత్రణకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు అక్కడి ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించాయి. భారత్‌లో కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలను ఇక్కడి ప్రజలకు అందించారు. బూస్టర్ డోస్‌ను కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో పుణేకు చెందిన సీరం సంస్థ తయారుచేసిన కోవిషీల్డ్ టీకా అందరికీ అందుబాటులో ఉండగా.. ఈ సంస్థ తయారుచేసి కొవావ్యాక్స్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ కొత్త వేరియంట్ బిఎఫ్-7 వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్న 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసుగా కొవావ్యాక్స్‌ టీకాను అందించేందుకు అనుమతించాలని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. ఈ మేరకు తమకు విపణిలో ప్రవేశం కల్పించాలంటూ భారత ఔషధ నియంత్రణ జనరల్‌ (డీసీజీఐ)కు ఈ ఏడాది అక్టోబరులో దరఖాస్తు చేయగా.. అనంతరం డీసీజీఐ లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సీరం సంస్థ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నొవావ్యాక్స్‌ నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ద్వారా కొవావ్యాక్స్‌ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. 7 నుంచి11 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో పరిమిత స్థాయిలో కొవావ్యాక్స్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ ఏడాది జూన్‌లోనే అనుమతులు మంజూరు చేసిన విషయం తెలసిందే.

అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ నుంచి లైసెన్స్ పొందిన సీరం సంస్థ ఈ టీకాను ఉత్పత్తి చేస్తుండగా.. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా అద్భుతంగా పనిచేస్తుందని గతంలోనే ఈ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త కోవిడ్ వేరియంట్ బిఎఫ్‌.7 భయంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ టీకా తీసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఉందని సీరం సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..