Viet Jet Tickets: చౌకధరలకే విమాన టికెట్లు.. తీరా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక ప్రయాణికులు షాక్‌..

Viet Jet Tickets: చౌకధరలకే విమాన టికెట్లు.. తీరా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక ప్రయాణికులు షాక్‌..

Anil kumar poka

|

Updated on: Dec 23, 2022 | 8:54 AM

విమానాల్లేకుండానే టికెట్లు అమ్మేసింది ఓ విమానయాన సంస్థ. అదికూడా తక్కువ ధరలకే. ధర తక్కువ కావడంతో ప్రయాణికులు ఎగబడి టికెట్లు కొన్నారు. తీరా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక


వియత్నాంకు చెందిన చవక ధరల విమానయాన సంస్థ వియెట్ జెట్ బెంగళూరు ప్రయాణికులను అయోమయానికి గురిచేసింది. బెంగళూరు నుంచి ఆ సంస్థ విమానాలేవీ నడవకపోయినప్పటికీ, బెంగళూరు నుంచి వియత్నాంకు టికెట్లు బుక్ చేసింది. వియెట్ జెట్ విమాన టికెట్లు తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి, బెంగళూరు నుంచి వియత్నాంలోని నగరాలకు వెళ్లేందుకు చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు. పాపం, వారందరూ బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు, అక్కడ వియెట్ జెట్ కు చెందిన విమానం ఒక్కటీ కనిపించకపోవడంతో గగ్గోలు పెట్టారు. బెంగళూరు నుంచి ఆ సంస్థ ఎలాంటి విమానాలు నడపడంలేదని తెలిసి దిగ్భ్రాంతి చెందారు. కొందరు ప్రయాణికులకు మాత్రం ఎయిర్ పోర్టుకు చేరుకోకముందే, విమానాలు రద్దయ్యాయంటూ ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందింది. అయితే వీరందరూ పలు ఆన్ లైన్ పోర్టళ్ల నుంచి టికెట్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇప్పుడా ప్రయాణికులు టికెట్ సొమ్ము రిఫండ్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా, ముంబయిలోని వియెట్ జెట్ ప్రతినిధులను మీడియా సంప్రదించే ప్రయత్నం చేయగా, అట్నుంచి స్పందన కనిపించలేదు. ఇదిలా ఉంటే, గత జులైలో వియెట్ జెట్ ప్రతినిధులు బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, బెంగళూరు నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నామని ప్రకటించారు. నవంబరు మొదటి వారం నుంచి విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 23, 2022 08:54 AM