Man Cheats Wife: వీడు అసలు మనిషేనా..? మరో యువతి మోజులో పడి.. భార్యకు HIV రక్తం ఎక్కించి..
గుంటూరు జిల్లాకు చెందిన చరణ్, మమతను ఐదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో మరో యువతితో చరణ్ కి వివాహేతర సంబంధం ఏర్పడింది. అడ్డుగా ఉన్న భార్యకి ఆర్‌ఎంపి వైద్యుని సాయంతో ఎచ్ఐవి వైరస్ ఎక్కించాడు భర్త
గుంటూరు జిల్లాకు చెందిన చరణ్, మమతను ఐదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో మరో యువతితో చరణ్ కి వివాహేతర సంబంధం ఏర్పడింది. అడ్డుగా ఉన్న భార్యకి ఆర్‌ఎంపి వైద్యుని సాయంతో ఎచ్ఐవి వైరస్ ఎక్కించాడు భర్త చరణ్. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బలానికి ఇంజక్షన్ అంటూ డ్రామా ఆడి, హెచ్‌ఐవీ రక్తం అందించాడు. ఆ తర్వాత భర్త నిజస్వరూపం తెలియడంతో నిలదీసింది. అవును.. నిన్ను నేను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నా.. నన్ను మరో అమ్మాయి ట్రాప్ చేసింది.. తప్పుదు విడిపోవాల్సిందే అన్నాడు. భర్త చేసిన మోసానికి ఏం చేయాలో అర్థం కాక పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది బాధితురాలు మమత. కుటుంబసభ్యులతో కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ ముందు భర్తపై ఈ ఆరోపణలు చేస్తూ బావురుమంది బాధితురాలు. తన బిడ్డకు, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. భవిష్యత్‌కు దారి చూపాలని వేడుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి.. విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

