Humanity: ఇది కదా మానవత్వం అంటే.. హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో.! తనకు ఒకరు సహాయం చేస్తే తను మరొకరికి సాయం.

Humanity: ఇది కదా మానవత్వం అంటే.. హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో.! తనకు ఒకరు సహాయం చేస్తే తను మరొకరికి సాయం.

Anil kumar poka

|

Updated on: Dec 23, 2022 | 8:40 AM

మానవత్వం కంటే పెద్ద మతంలేదు.. మానవ సేవ కంటే గొప్ప ఆరాధన లేదు.. అందుకే మనిషి తనలోని మానవత్వాన్ని ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే నేటి


నిరాశ్రయురాలైన ఓ మహిళ.. చేతిలో చిన్న బోర్డు లాంటిది పట్టుకొని రోడ్డుపక్కన విచారంగా కూర్చుని ఉంది. ఆబోర్డు పైన నిరాశ్రయురాలిని అని రాసి ఉంది. చాలా మంది ఆ యువతికి కొంత డబ్బు ఇచ్చి సహాయం చేశారు. ఇంతలో.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి తన సమస్యలను ఆమెకు వివరించాడు.. అప్పుడు ఆ స్త్రీ తన బాధను సమస్యను మర్చిపోయి అతనికి డబ్బు ఇచ్చి సహాయం చేసింది. అయితే అందుకు ప్రతిగా సదరు వ్యక్తి సీల్డ్ కవరును ఆ మహిళకు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ మహిళ ఆ కవరు తెరిచి చూడగానే అందులో కొన్ని నోట్లు ఉన్నాయి. అది చూసి ఉద్వేగానికి లోనైన ఆ మహిళ తను కూర్చున్న దగ్గరినుంచి లేచి పరుగు పరుగున ఆ యువకుడికి వద్దకు వెళ్లి.. హగ్‌ చేసుకొని కృతజ్ఞతలు తెలిపింది. మనసుకు హత్తుకునే వీడియోను ఓ యూజర్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ఈ యువతి మనసు గెలుచుకుంది అనే క్యాప్షన్ జోడించారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను 60 వేల మందికి పైగా వీక్షించారు. అలాగే వేలాదిమంది వీడియోను లైక్‌ చేస్తూ హృదయాన్ని కదిలించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 23, 2022 08:40 AM