Alzheimers disease: మీ బ్రెయిన్ లో విటమిన్ డీ ఉందా? అయితే మీ ఆలోచనలు వయసును దాటి పరుగెడుతాయి! ఫ్యాక్ట్స్ కోసం చదవండి..
విటమిన్ డీ.. ఈ అల్జీమర్స్, డిమెన్షియాను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు చురుకుగా మారి.. మనిషి ఆలోచనల సరళి కూడా మారుతుందని చెబుతున్నారు.

వయస్సు.. శరీరంతో పాటు జీవన శైలిలోనూ మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తుంది. నిద్ర సమయాన్ని తగ్గిస్తుంటుంది. అలాగే జ్ఞాపకశక్తిని హరిస్తుంది. దానిని అలా వదిలేస్తే అల్జీమర్స్, డిమెన్షియా కు దారితీస్తుంది. అయితే విటమిన్ డీ.. ఈ అల్జీమర్స్, డిమెన్షియాను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు చురుకుగా మారి.. మనిషి ఆలోచనల సరళి కూడా మారుతుందని చెబుతున్నారు.
వెళ్లూనుకుంటున్న అల్జీమర్స్..
అల్జీమర్స్ వ్యాధి లేదా డిమెన్షియా ఒక మనిషి ఆలోచనా శక్తిని హరించి, తన దైనందిన పనులు కూడా సక్రమంగా చేసుకొనివ్వకుండా చేస్తుంది. చివరికి ఈ వ్యాధిగ్రస్థులు తమను తాము కూడా మర్చిపోతారు. ఇటీవల కాలంలో ఈ అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధిగ్రస్తులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నట్లు అల్జీమర్స్ అసోసియేషన్ ప్రచురించిన ఓ జర్నల్ లో పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల మంది ఈ రోగం బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దీనిని నివారించడానికి అత్యవసర స్థాయిలో మందు అవసరం అయ్యింది. దీంతో చేసిన పరిశోధనల్లో విటమిన్ డీ మారి.. ఒక ఔషధంలా ఈ అల్జీమర్స్ పై పనిచేస్తుందని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఎవరి బ్రెయిన్లో అయితే అధిక మోతాదులో విటమిన్ డీ ఉంటుందో వారిలో ఈ అల్జీమర్స్ వ్యాధిని నివారించే శక్తి పెరుగుతున్నట్లు నిర్ధారించింది.
విటమిన్ డీ తో బహుళ ప్రయోజనాలు..
విటమిన్ డీ సాధారణంగా ఉదయం సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి అవసరమైనంత మొత్తంలో పుష్కలంగా దొరకుతుంది. అయితే దీని వల్ల మతిమరుపు కూడా తొలగి పోతుంది. ఒకవేళ విటమిన్ డీ డెఫిషియన్సీ ఉంటే వెంటనే అందుకు తగిన ఆహారంతో పాటు రోజూ ఎండలో ఓ అరగంట పాటు ఉంటే సమస్య ఉండదు.



మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..