Health Tips: మంచినీళ్లు తాగడం ఎలా..? కూర్చోవాలా.. నిలబడితే మంచిదా..?
కానీ కూర్చొని పాలు తాగితే అది జీర్ణవ్యవస్థ కింది భాగంలో పేరుకుపోయి సరిగా జీర్ణం కాదు. ఇలా నిరంతరం చేస్తుంటే అది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధికి దారి తీస్తుంది.
పరిగెత్తి పాలు తాగేకంటే.. నిలబడి నీళ్లు తాగటం ఉత్తమం.. అనేది ఒక సాధారణ సామెతగా అందరికీ తెలిసిందే. అయితే దీని వెనుక సైంటిఫిక్ లాజిక్ ఉంది. కూర్చొని నీరు త్రాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం, నిలబడి తాగడం హానికరం అని ఇది రుజువు చేస్తుంది. నిలబడి పాలు తాగకపోతే లాభం కాకుండా కీడు కలుగుతుంది. కూర్చొని నీరు త్రాగాలని సలహా వెనుక కారణం ఏమిటంటే, అలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ, కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కూర్చొని నీరు త్రాగడం వల్ల మీ కిడ్నీలు సులభంగా ఫిల్టర్ చేసే పనిని కూడా చేస్తాయి. కానీ నిలబడి నీళ్లు తాగితే దాని దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిలబడి నీరు త్రాగడం వల్ల కలిగే అతి పెద్ద ప్రతికూలత ఏమిటంటే ఇది ఎముకల నుండి కాల్షియం క్షీణిస్తుంది. అంతేకాకుండా, మీరు గుండెల్లో, మంట, అల్సర్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. కడుపులో ఆమ్లం పేరుకుపోవడం వల్ల జీర్ణక్రియ సమస్య కావచ్చు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లలో ద్రవం చేరడం వల్ల కీళ్లనొప్పుల సమస్యలు వస్తాయి.
నిలబడి నీళ్ళు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. తాగిన నీళ్లు వేగంగా వెళ్లి పొత్తికడుపుపై ప్రభావం చూపుతాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల టాక్సిన్స్ పెరుగుతాయి. కూర్చున్నప్పుడు మన కిడ్నీలు బాగా ఫిల్టర్ అవుతాయని చాలా నివేదికలలో తేలింది. నిలబడి నీరు తాగినప్పుడు నీరు దిగువ పొట్టకు ఎలాంటి వడపోత లేకుండా వెళుతాయి. దీని వల్ల మూత్రాశయంలో నీటి మలినాలు చేరి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. మూత్ర నాళాల రుగ్మతలను కలిగిస్తుంది.
నిలబడి నీళ్లు తాగినప్పుడు అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు. మీరు నిలబడి నీరు తాగినప్పుడు అవి శరీరంలోకి వేగంగా వెళుతాయి. దీనివల్ల ఆక్సిజన్ స్థాయి చెదిరిపోతుంది. కాబట్టి ఊపిరితిత్తులు గుండె పనితీరును ప్రమాదంలో పడేస్తుంది. నిలబడి నీళ్లు తాగినప్పుడు నరాలు ఉద్రిక్తత స్థితిలో ఉంటాయి. ఇది ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. శరీరంలో విషపదార్ధాలు, అజీర్ణాన్ని పెంచుతుంది. ఇలా చేయడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఎందుకంటే నిలబడి నీరు తాగడం వల్ల కీళ్ళలో ద్రవాలు పేరుకుపోతాయి. తద్వారా ఆర్థరైటిస్ సమస్యలు, కీళ్ల నొప్పులు వస్తాయి.
నీరు తాగడానికి సరైన మార్గం.. నీరు తాగడానికి సరైన మార్గం ఏంటంటే కుర్చీపై కూర్చుని, వెన్న భాగాన్ని నిటారుగా ఉంచి నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల పోషకాలు మెదడుకు చేరుకుంటాయి. మెదడు తన పనితీరును మెరుగుపరుచుకుంటుంది. ఇది మాత్రమే కాదు జీర్ణక్రియ బాగవుతుంది.
పాలు ఎలా తాగాలి? పాలు నిలుచుని త్రాగడం వెనుక ఉన్న హేతువు ఏమిటంటే పాలలోని పోషకాలు సరిగ్గా గ్రహించబడతాయి. కానీ కూర్చొని పాలు తాగితే అది జీర్ణవ్యవస్థ కింది భాగంలో పేరుకుపోయి సరిగా జీర్ణం కాదు. ఇలా నిరంతరం చేస్తుంటే అది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధికి దారి తీస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి