Viral Video: ఓర్నీ.. ఇలా కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయా..? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్

సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు జనాలు. దాంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది. ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా..? అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు.

Viral Video: ఓర్నీ.. ఇలా కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయా..? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్
Accident Video
Follow us

|

Updated on: Dec 21, 2022 | 8:49 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఒక్కోసారి ఫన్నీగా, ఒక్కోసారి భయానకంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తరచూ వైరల్‌గా మారే వీడియోల్లో రోడ్డుప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. రెప్పపాటు క్షణంలో జరిగే ప్రమాదం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే…

రోడ్డున పక్కనే ఉన్న ఓ టీ దుకాణంలో యజమాని టీ తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇందులో కస్టమర్ షాపులో కూర్చుని కనిపిస్తు్‌న్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అంతలోనే అక్కడ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఓ టెంపో వేగంగా షాపులోకి దూసుకెళ్లింది. దాంతో షాప్‌ షెడ్‌తో పాటు దుకాణంలోని సామాగ్రి మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటన సూరత్‌లో జరిగినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు జనాలు. దాంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది. ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా..? అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు. ఈ సంఘటనలో దుకాణం దెబ్బతింది. ఎటువంటి ప్రాణనష్టం గురించి సమాచారం లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి