Skin Care: ఎండాకాలం, చలికాలమైనా సరే.. పట్టులాంటి చర్మం కోసం చక్కటి ఇంటి చిట్కాలు.. మెరుపు ఖాయం..!
అందుకే చలికాలం చర్మ రక్షణ కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో మీ ముఖాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
చలికాలం వచ్చిందంటే చాలు మన చర్మం విపరీతంగా పాడైపోతుంది. విపరీతమైన చలి దెబ్బకు చర్మం తన సున్నితత్వాన్ని కోల్పోయి రఫ్ గా తయారవుతుంది. పొడిబారిపోయినట్లు మారుతుంది. చలికాలం చర్మ సంరక్షణపై దృష్టి సారించకపోతే కచ్చితంగా అందవిహీనంగా తయారవుతాము. అందుకే చలికాలం చర్మ రక్షణ కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో మీ ముఖాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బాదం, పచ్చి పాలు: బాదంపప్పులను గ్రైండ్ చేయండి. ఈ పొడిని పాలలో నానబెట్టండి. అరగంట తర్వాత ఈ పేస్ట్‌లో పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. డెడ్ స్కిన్ తొలగిస్తుంది. ముఖంలోని టానింగ్, డార్క్‌నింగ్ అన్నీ పోతాయి. చర్మం లోపల తేమను పొంది ముఖం మెరుస్తుంది.
నిమ్మకాయ, పసుపు: క్రీమ్ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా తేమ చేస్తుంది. మీగడలో పసుపు, నిమ్మరసం కలిపి రాసుకుంటే ముఖం మెరిసిపోతుంది. పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పేస్ట్ టానింగ్‌ను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ట్యానింగ్ మొత్తం తొలగిపోతుంది.
నిమ్మరసం తేనె: నిమ్మరసం, తేనె రెండింటిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసం, తేనె రెండింటి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం పొడిబారడం పోతుంది. నిమ్మరసం,తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేస్తాయి.
నిమ్మరసం : యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మకాయ చర్మానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలో పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. నిమ్మ, పసుపు ఈ పేస్ట్ టానింగ్ తొలగిస్తుంది. చర్మ కణాలకు చికిత్స చేయడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
ఆయిల్ మసాజ్: ఆర్గాన్ ఆయిల్, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ చలికాలంలో చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందుతాయి. ఈ నూనెలను ముఖంపై మసాజ్ చేయడం వల్ల పొడిబారకుండా ఉంటుంది.
ఆహారం : మన ఆహారం, పానీయాలు చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఈ రోజుల్లో మీరు మీ ఆహారంలో పాలకూర, బీట్‌రూట్, బొప్పాయిని చేర్చుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి