Home remedies: ఇంటి చిట్కాల కోసం గూగుల్ ని జల్లెడ పడుతున్న జనాలు.. 2022 లో ఎక్కువ మంది వెతికిన టిప్స్ ఏంటి? మీరు ఓ లుక్కేయండి..
ముఖ్యంగా ఇంటి చిట్కాల కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వెతుకుతున్న వారి సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకూ గూగుల్ లో ఎక్కువ మంది వెతికిని ఇంటి చిట్కా ఏంటి? తెలుసుకోవాలని ఉందా?
అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత ప్రతి ఒక్కరిని డిజిటల్ బాట పట్టించింది. ఏది కావాలన్నా ఆన్ లైన్ లో వెతకడం అలవాటైపోయింది. ముఖ్యంగా కరోనా అనంతర జీవన విధానంలో ఆరోగ్యానికి ప్రాధాన్యం పెరిగింది. దగ్గు, జలుబు నుంచి అన్ని పెద్ద వ్యాధులపై అవగాహన కోసం అంతా గూగుల్ నే ఆధారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటి చిట్కాల కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వెతుకుతున్న వారి సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకూ గూగుల్ లో ఎక్కువ మంది వెతికిని ఇంటి చిట్కా ఏంటి? తెలుసుకోవాలని ఉందా? మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఈ 2022 లో నెటిజనులు అతి ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసిన ఇంటి చిట్కాలు? ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పిల్లల చెవి నొప్పికి ఇంటి చిట్కా..
పిల్లలో చెవి నొప్పిని తగ్గించేందుకు ఇంటి చిట్కాల కోసం అత్యధిక శాతం జనాలు గూగుల్లో వెతికారు. దీనికి సమాధానం.. లవంగం, వెల్లుల్లి నూనె వాడటం ద్వారా చెవి నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.
నల్ల పెదాల కోసం ఏమి చేయాలి..
సాధారణంగా చలికాలంలో పెదాలు డ్రై అయిపోయి నల్లగా మారతాయి. అలాగే ధూమపానం అలవాటు ఉన్నవారి పెదాలు కూడా నల్లగా ఉంటాయి. దీనికి సంబంధించిన ఇంటి చిట్కా ఏంటంటే కొబ్బరి నూనె, బీట్ రూట్ క్రీమ్.. షుగర్ తో తయారు చేసే పలు రకాల స్క్రబ్స్ కూడా పెదవుల నలుపుదనాన్ని తగ్గిస్తాయి.
ఫుడ్ పాయిజనింగ్ కి ఇంటి చిట్కాలు..
అనారోగ్యకరమైన ఆహారం లేదా కలుషిత నీరు తాగినప్పుడు సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇది సంభవించినప్పుడు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. కాని దీనికి కూడా చాలా మంది ఇంటి చిట్కాను గూగుల్ లో వెతికారు. దీనికి రెమిడీగా నిమ్మకాయ రసంలో కాస్త ఉప్పు వేసుకొని తాగడం, అది లేకపోతే సోడా కూడా తాగవచ్చు. దీని వల్ల కడుపులో ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే పెరుగులో పొదీనా వేసుకొని తినవచ్చు.
తేనేటీగ కుడితే ఏం చేయాలి..
తేనేటీగ కుట్టిన సమయంలో ఏం చేయాలి అని చాలామంది వెతికారు. ఇలాంటి సందర్భంలో మొదట అది కుట్టిన చోట బాగా రబ్ చేయాలి. తేనేటీగ ముల్లును బయటకు తీసేయాలి. ఆ తర్వాత ఐస్ లేదా టూత్ పేస్ట్ పెట్టాలి. ఆ తర్వాత కొంచెం తేనే రాసి వదిలేయాలి.
పీరియడ్స్ నిలిచిపోవాలంటే..
అసలు ఇదీ సాధ్యమేనా.. ఒక్క రాత్రిలోనే పీరియడ్స్ ఆగిపోతాయా? అయినప్పటికీ ఈ ఏడాది చాలా మంది దీని కోసం గూగుల్లో వెతికారు. ఇది సాధ్యకాకపోయినా ఆకుకూరలు, బెల్లం తీసుకోవడంతో పాటు వేడి వేడి వస్తువులు ఆహారంగా తీసుకోవడం ద్వారా కొన్ని అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
గ్యాస్ సమస్య వెంటనే తగ్గిపోవాలంటే..
గ్యాస్ సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే.. మొదట వైద్యుడిని సంప్రదించాలి. దీనికి ఇంటి చిట్కా ఏంటంటే అల్లం, యాలకులతో కూడిన టీని తీసుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. అలాగే కాస్త ఉప్పు కలిపిన నిమ్మరసం తీసుకుంటే మంచింది.
ఐదు నిమిషాల్లో దగ్గు తగ్గిపోవాలి..
2022లో అత్యధిక శాతం మంది వెతికిన ఇంటి చిట్కా ఐదు నిమిషాల్లో దగ్గు తగ్గిపోవాలంటే ఏం చేయాలి అని.. సాధారణంగా ఐదు నిమిషాల్లో దగ్గు తగ్గిపోవడం సాధ్యం కాదు. అయితే అల్లం, తేనేతో దగ్గు నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు.
మొటిమలకు ఇంటి చిట్కా..
మొటిమలకు ఇంటి చిట్కా కోసం కూడా చాలా మంది ఆన్ లైన్ లో వెతికారు. వేప, లవంగం పేస్ట్ తో పాటు పసుపు వాడటం ద్వారా అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..