Paratha Recipe: ఈ ఆకుతో ఆలూ పరోటా ఇలా చేశారో అంతే..టేస్ట్ అదుర్స్ అనాల్సిందే

శీతాకాలంలో ఎక్కువుగా ఆకుకూరలు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇంట్లో వాళ్లు ఆకు కూరలతో ఏదైనా వంట చేస్తే సింపుల్ పక్కన పెట్టెస్తుంటాం. అయితే టేస్టీ వంటకం ఆకు కూరతో చేస్తే..! తింటారు కదా.. అలాంటి వంటే ఆలూ పరోటా

Paratha Recipe: ఈ ఆకుతో ఆలూ పరోటా ఇలా చేశారో అంతే..టేస్ట్ అదుర్స్ అనాల్సిందే
Methi Paratha
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 21, 2022 | 2:40 PM

చలికాలంలో మనకు ఏదైనా కొత్త వంటకాలు తినాలనిపిస్తుంది. రెగ్యులర్ గా చేసేవి కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలని ఇంట్లో వాళ్లను సతాయిస్తుంటాం. అలాగే శీతాకాలంలో ఎక్కువుగా ఆకుకూరలు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇంట్లో వాళ్లు ఆకు కూరలతో ఏదైనా వంట చేస్తే సింపుల్ పక్కన పెట్టెస్తుంటాం. అయితే టేస్టీ వంటకం ఆకు కూరతో చేస్తే..! తింటారు కదా.. అలాంటి వంటే ఆలూ పరోటా. ఆలూ పరోటాకే ఇంత బిల్డప్పా అంటే మరి అంతే మరి మెంతి కూరతో చేసే ఆలూ పరోటాకు మాత్రం జై కొట్టకుండా ఉండలేరు. 

సాధారణంగా ఆలూ పరోటా అనేది ఉత్తరాది వంటకం. మైదా లేదా గోదుమ పిండిలో ఉడికించిన బంగాళదుంపలు కలిపి చపాతిలా చేసి పెనంపై కాలుస్తుంటారు. దీనికి ఏదైనా కూరను జత చేసి ఇంచక్కా లాగిస్తుంటారు. అయితే రెగ్యులర్ గా చేసే ఈ రెసిపీకి కొంచెం కొత్తదనాన్ని యాడ్ చేద్దాం. పరోటా అంటే సాధారణంగా మైదా లేదా గోధుమ పిండితో చేస్తారు. కానీ మేతి ఆలూపరోటాలో కొంచెం శెనగ పిండి కూడా కలపాలి. మనం దీన్ని సాయంత్రం సమయంలో స్నాక్ కింద తినొచ్చు. కొత్తగా ఉండే దీని తయారీ విధానం తెలుసుకుందాం. 

ఇవి కూడా చదవండి

మేతి ఆలూ పరోటా తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలోకి కొంచెం శెనగపిండి, మరికొంచెం మైదా తీసుకోవాలి.
  • తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసి బాగా కలపాలి
  • అనంతరం అందులో సన్నగా తరగిన మెంతి ఆకు వేయాలి.
  • సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
  • అలాగే కారం, పసుపు, టేస్టింగ్ సాల్ట్ ను జత చేయాలి. 
  • ఇప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, నెయ్యి లేదా వెన్నను జత చేస్తూ మెత్తగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని కాసేపు అలానే వదిలేసి, అనంతరం చపాతీల్లా ఒత్తుకోవాలి.
  • అనంతరం పెనంపై సనన్ని మంటపై రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని పెరుగుతో సర్వ్ చేయాలి. 
  • ఈ పరోటా పెరుగు లేకుండా కూడా లొట్టలేస్తూ లాగించేయవచ్చు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో