Badam Oil Benefits: శీతాకాలంలో ఈ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే బాదం ఆయిల్‌తో చెక్ పెట్టేయండి

చర్మానికి బాదం ఆయిల్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని చర్మ సంబంధిత వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్ విటమిన్ - ఈ ఉండే ఉత్పత్తులను వాడడం మంచిది.

Badam Oil Benefits: శీతాకాలంలో ఈ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే బాదం ఆయిల్‌తో చెక్ పెట్టేయండి
Badam Oil
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 20, 2022 | 11:53 AM

శీతాకాలంలో చర్మ సమస్యలుఎక్కువగా వస్తుంటాయి. ఈ కాలంలోనే మన చర్మ రక్షణకు వివిధ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తీసుకోకపోతే నలుగురిలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎక్కువ చర్మానికి మాయిశ్చరైజర్ వాడుతుంటాం. దీని వల్ల బయటకు వెళ్లినప్పుడు చర్మానికి దుమ్ము అంటుకుంటుంది. అలాగే చర్మం ట్యాన్ అయిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి చర్మానికి బాదం ఆయిల్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని చర్మ సంబంధిత వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్ విటమిన్ – ఈ ఉండే ఉత్పత్తులను వాడడం మంచిది. సో అది ఉత్తమంగా ఉండే ఆల్మండ్ ఆయిల్ ను వాడితే చలికాలంలో చర్మాన్ని అందంగా మార్చడమే కాకుండా ధీర్ఘకాలికంగా ఉండే చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

డార్క్ సర్కిల్స్ సమస్య దూరం

ముఖానికి తరచూ బాదం నూనె రాస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు త్వరగా మాయమవుతాయి. బాదం నూనెతో ప్రతిరోజు కళ్ల కింద చేతులతో తేలికగా మసాజ్ చేస్తే కొన్ని వారాల తర్వాత మార్పును గమనించవచ్చు. 

ముడతలు

బాదం నూనెలో ఉండే విటమిన్ – ఈ కారణంగా చర్మంపై ముడతలు ఈజీగా దూరమవుతాయి. రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాస్తే ప్రభావవంతమైన ఫలితాలను పొందవచ్చు

ఇవి కూడా చదవండి

మొటిమలు

ముఖంపై మొటిమల సమస్యతో బాధపడేవారు రోజూ ముఖానికి బాదం నూనెను రాసుకుంటే మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం నుంచి బ్యాక్టీరియాను తొలగించడానికి సాయపడుతుంది. అలాగే లోపల నుంచి రంధ్రాలను శుభ్రం చేస్తుంది. 

చర్మం పగుళ్ల సమస్య మాయం

చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల పగుళ్లు వస్తాయి. పగుళ్లు వచ్చిన చోట ఎర్రబడి విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ బాధ నుంచి రక్షణకు బాదం నూనె వాడవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంలోని తేమ కరెక్ట్ గా మెయిన్ టెయిన్ అవుతుంది. అలాగే బాదం నూనె వల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది. 

చుండ్రు నుంచి రక్షణ

శీతాకాలంలో ఒక్క చర్మమే కాదు జుట్టు కూడా వివిధ సమస్యలకు గురవుతుంది. అందులో ముఖ్యమైంది చుండ్రు సమస్య. స్కాల్ప్ పై చుండ్రును గమనించిన వెంటనే బాదం నూనెతో వారానికి ఓ సారి మసాజ్ చేస్తే మెరుగైన  ఫలితాలను పొందవచ్చు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..