Grapes Side Effects: ద్రాక్ష పండ్లు తింటే అలర్జీ సమస్యలు..? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి

చలికాలంలో అధికంగా దొరికే ద్రాక్ష పండ్లను కొంతమందైతే అదే పనిగా తింటారు. పిల్లలు కూడా తింటుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అని పెద్ద వాళ్లు పట్టించుకోరు. అతి సర్వత్రా వజ్రయేత్ అనే నానుడి ప్రకారం ద్రాక్ష పండ్లు అధికంగా తింటే అనార్థాలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Grapes Side Effects: ద్రాక్ష పండ్లు తింటే అలర్జీ సమస్యలు..? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి
Grapes
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2022 | 5:00 PM

పండ్లల్లో పేదవాడికి కూడా అందుబాటులో ఉండేవి ద్రాక్ష పండ్లు.. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. చలికాలంలో అధికంగా దొరికే ద్రాక్ష పండ్లను కొంతమందైతే అదే పనిగా తింటారు. పిల్లలు కూడా తింటుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అని పెద్ద వాళ్లు పట్టించుకోరు. అతి సర్వత్రా వర్జయేత్ అనే నానుడి ప్రకారం ద్రాక్ష పండ్లు అధికంగా తింటే అనర్థాలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సలాడ్ దగ్గర నుంచి జ్యూస్ ల వరకూ ప్రతి దాంట్లో ద్రాక్షను వినియోగిస్తున్నారు. ద్రాక్షలో విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అందరూ ద్రాక్ష వాడకంలో అడ్డు చెప్పరు. కానీ ద్రాక్షను అధికంగా వినియోగిస్తే బరువు పెరుగుతారు. అలాగే ద్రాక్షలో ఉండే తీపి కారణంగా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

ద్రాక్ష వల్ల కలిగే అనార్థాలు ఇవీ:

డయేరియా ప్రమాదం

ద్రాక్షను అధికంగా వినియోగిస్తే డయేరియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తీపి ఎక్కువగా ఉంటే ఆహారాన్ని స్వీకరించినప్పడు డయేరియా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ద్రాక్షలో ఉండే తీపితో విరేచనాల వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ద్రాక్షను తినకుండా ఉంటే మంచిది. 

మూత్రపిండాలకు చేటు

మూత్రపిండాల వ్యాధి, చక్కెర వ్యాధులు ఉన్న వారు ద్రాక్ష పండ్లను తినకూడదు. ద్రాక్ష పండ్ల అధిక వినియోగం వల్ల కిడ్నీ సమస్యలకు దారి తీయవచ్చు. అలాగే ఇందులోని చక్కెర వల్ల మధుమేహం పెరిగే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

బరువు పెరగడం

సాధారణంగా చలికాలంలో బరువు పెరుగుదల సమస్య ఉంటుంది. అయితే ద్రాక్ష పండ్లను అధికంగా తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. ద్రాక్షలో ఉండే ప్రోటీన్, ఫైబర్, కొవ్వు, కాపర్, విటమిన్ కే, థయామిన్ ఉండడం వల్ల బరువు పెరగడానికి దారి తీస్తుంది. 

గర్భిణులకు ఇబ్బంది

గర్భిణులు అధికంగా ద్రాక్ష పండ్లను తింటే బిడ్డను మరింత కీడును చేస్తుంది. ద్రాక్షలో పాలిఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇది తల్లి గర్భంలో ఉండే శిశువును ప్యాంక్రియాటిక్ సమస్యలకు కారణం కావొచ్చు.

అలర్జీ సమస్య

ద్రాక్ష అలెర్జీ సమస్యలకు కారణమవుతుంది. ఇందులో ఉండే లిక్విడ్ ప్రోటీన్ ట్రాన్స్ ఫెరాస్ అలర్జీని పెంచుతుంది. ద్రాక్షను అధికంగా తింటే నోటి దురద, ఎరుపు, వాపు వంటి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం