Green Peas In Winter: శీతాకాలంలో పచ్చి బఠానీలు ఎన్ని ప్రయోజనాలను ఇస్తాయో మీకు తెలుసా..? తెలిసాక తినకుండా ఉండలేరంతే..

పోషక విలువలు ఉన్న పదార్థాలలో పచ్చి బఠానీలు చెప్పుకోదగినవి. శీతాకాల మార్కెట్‌లలో విరివిగా దొరికే పచ్చి బఠానీలను నిత్యం తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తక్కువ ధరలోనే లభించే పచ్చి బఠానీలను తినడం వల్ల..

Green Peas In Winter: శీతాకాలంలో పచ్చి బఠానీలు ఎన్ని ప్రయోజనాలను ఇస్తాయో మీకు తెలుసా..? తెలిసాక తినకుండా ఉండలేరంతే..
Green Peas In Winter
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 19, 2022 | 1:36 PM

చలికాలం అంటేనే అనేక అంటువ్యాధులు, ఆరోగ్య సమస్యలు కలిగే సమయం. ఈ కాలంలో సరైన ఆహార నియమాలు పాటించకపోతే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడక తప్పదు. శీతాకాలంలో పోషకాహారం అంటే విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రెట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పదార్థాలను తప్పని సరిగా తినాలి. ఇక అలాంటి పోషక విలువలు ఉన్న పదార్థాలలో పచ్చి బఠానీలు చెప్పుకోదగినవి. శీతాకాల మార్కెట్‌లలో విరివిగా దొరికే పచ్చి బఠానీలను నిత్యం తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తక్కువ ధరలోనే లభించే పచ్చి బఠానీలను తినడం వల్ల గుండె నుంచి కిడ్నీ వరకు అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాక పచ్చి బఠానీలు రక్తపోటును నియంత్రించడంలో కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇక డయాబెటిక్ పేషెంట్‌లతో మొదలు బరువు తగ్గాలనుకునే వారి వరకు పచ్చి బఠానీలు ఎంతగానో మేలు చేస్తాయి. మరి పచ్చి బఠానీలు మనకు ఏయే విధంగా ఉపకరిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

పచ్చి బఠానీల్లో ఉండే ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి బఠానీల ద్వారా శరీరానికి తగినంత యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరచడమే కాక కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.

మెరుగైన జీర్ణవ్యవస్థ

పచ్చి బఠానీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానీలు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్‌ను కలిగి  ఉండడమే కాక శరీరంలోని చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ముఖంలో నిగారింపు

పచ్చి బఠానీలు రుచి, ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ముఖ్యమైనవి. మేకోవర్ ఆర్టిస్ట్ ప్రకారం పచ్చి బఠానీలను గ్రైండ్ చేసి ముఖానికి రాసుకుంటే అది స్క్రబ్‌లా పనిచేస్తుంది. పచ్చి బఠానీలు చర్మాన్ని శుభ్రపరచి, ముఖానికి మెరుపునిస్తాయి. అలాగే చర్మానికి నిగారింపునిస్తాయి.

అల్జీమర్స్ వ్యాధి నుంచి ఉపశమనం

పచ్చి బఠానీల్లో ఉండే పాల్‌మిటోయ్‌లెథనోలమైడ్ (పీఈఏ) అనే పదార్థం అల్జీమర్స్‌తో పోరాడటానికి సహాయపడుతుందని ఇటీవలి కాలంలోనే అమెరికాకు చెందిన వైద్య బృందం పేర్కొంది. బఠానీలలో ఉండే సెలీనియం కీళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో ఉపకరిస్తుంది.

మడమలు పగుళ్లకు నివారణ

చర్మ సంరక్షణలో చాలా ప్రయోజనకరంగా పనిచేసే విటమిన్-ఎ, ఇ.. పచ్చి బఠానీల్లో పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో పెదవులు,  మడమలు పగిలిపోవడం అనేది సర్వసాధారణమైన ఇంకా ఇబ్బందికరమైన విషయం. అటువంటి పరిస్థితిలో పచ్చి బఠానీలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..