Twitter: ఇకపై ట్విట్టర్‌లో ఆ లింక్‌లను పోస్ట్‌ చేయకూడదు.. రూల్ అతిక్రమిస్తే మీ ఖాతా బ్యాన్.. కారణం ఏమిటంటే..

ఎలోన్ మస్క్ కనుసన్నల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా కంపెనీలను సెన్సార్ చేయడం ప్రారంభించింది. ఫేస్‌బుక్, ట్రూత్ సోషల్, పోస్ట్ వంటి ఇతర కంపెనీల ఖాతాలను ట్విట్టర్‌లో ప్రమోట్ చేసుకోవడాన్ని ఇకపై అనుమతించబోమని..

Twitter: ఇకపై ట్విట్టర్‌లో ఆ లింక్‌లను పోస్ట్‌ చేయకూడదు.. రూల్ అతిక్రమిస్తే మీ ఖాతా బ్యాన్.. కారణం ఏమిటంటే..
Twitter
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 19, 2022 | 1:02 PM

ఎలోన్ మస్క్ కనుసన్నల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా కంపెనీలను సెన్సార్ చేయడం ప్రారంభించింది. ఫేస్‌బుక్, ట్రూత్ సోషల్, పోస్ట్ వంటి ఇతర కంపెనీల ఖాతాలను ట్విట్టర్‌లో ప్రమోట్ చేసుకోవడాన్ని ఇకపై అనుమతించబోమని ఆ కంపెనీ తెలిపింది. అయితే ఆదివారం ట్విట్టర్ చేసిన ఈ ప్రకటనపై కోట్లాది మంది సోషల్ మీడియా ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ఖాతాదారులు చాలా మంది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చురుకుగా ఉన్నారని గుర్తించిన ఆ కంపెనీ ‘మేము ఇకపై ట్విట్టర్‌లో కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రమోషన్‌లను అనుమతించము’ అని ట్విట్టర్ తెలిపింది.
అయితే ‘ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మాస్టొడన్, ట్రూత్ సోషల్, ట్రైబెల్, పోస్ట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల లింక్‌లను ట్విట్టర్‌లో ప్రమోట్ చేయాలనుకునే వినియోగదారలును మేము తొలగిస్తాము’ అని ట్విట్టర్ తెలిపింది. ఇంకా ‘‘పై జాబితాలో లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల లింక్‌లు, ఖాతా పేర్లను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ఈ విధానాన్న ఉల్లంఘించినట్లు కాద’’ని ఎలన్ మస్క్ ఆధీనంలోని కంపెనీ తెలిపింది. ఈ విధానాలను ఉల్లంఘించే ఖాతాలపై చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ తెలిపింది. ‘‘ఈ విధానాన్ని ఉల్లంఘించి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల లింక్‌లను మీ బయో లేదా ఖతాలో చేర్చినట్లయితే.. మేము మీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తాము. ఇకపై మా నియమాలను ఉల్లంఘించకుండా మీ ప్రొఫైల్‌లో మార్పులు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత కూడా ఉల్లంఘనలకు పాల్పడితే మీ ఖాతను శాశ్వతంగా నిలిపివేయవచ్చు’’ అని ట్విట్టర్ తెలిపింది.
కాగా, వినియోగదారలు ముందు ట్విట్టర్ ఉంచిన ఈ నియమాలు లేదా ప్రతిపాదన ఖాతాదారులకు నచ్చలేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ‘‘ ట్విట్టర్ తీసుకున్న ఈ చాలా మంది ట్విట్టర్ వినియోగదారులకు నచ్చలేదు. ఇది చాలా నిరాశాజనకమైన చర్య. ట్విట్టర్ కంపెనీ తన వినియోగదారులకు విరుద్ధమైన పనిని చేసిందని గుర్తుంచుకోవడం చాలా కష్టం.’’ అని న్యూయార్క్ టైమ్స్‌లో ఒపినియన్ కాలమిస్ట్ ఫర్హాద్ మంజూ ట్వీట్ చేశారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?