AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హవాయ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 11 మంది పరిస్థితి విషమం.. ఫ్లైట్ గాలిలో ఉండగా..

అమెరికాలోని హావాయి ఎయిర్‌లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ప్రఛండమైన గాలుల తాకిడికి అతలాకుతలమైంది.

హవాయ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 11 మంది పరిస్థితి విషమం.. ఫ్లైట్ గాలిలో ఉండగా..
Hawaiian Airlines
Shaik Madar Saheb
|

Updated on: Dec 19, 2022 | 1:49 PM

Share

అమెరికాలోని హావాయి ఎయిర్‌లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ప్రఛండమైన గాలుల తాకిడికి అతలాకుతలమైంది. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఫోనిక్స్ నుంచి హోనలులుకు వెళుతున్న విమానం ఆకాశంలో తీవ్రమైన సుడి గాలుల తాకిడికి ఊగిపోయింది. భీకర గాలులతో విమానంలోని ప్రయాణికులంతా గాయపడ్డారు. ప్రమాద సమయంలో 278 మంది ప్రయాణికులు 10మంది సిబ్బంది ఉన్నారు. విమానం వెళ్తుండగా.. సుడి గాలుల తాకిడికి గతి తప్పి ఊగిపోయింది.

ప్రఛండమైన గాలులు తాకగానే ప్రయాణికులు సీటుబెల్టుపెట్టుకోవడానికి సైతం అవకాశం లేకపోయింది. దీంతో విమానంలో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోతూ సీట్లకు కొట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విలయం నుంచి ఎట్టకేలకు పైలెట్లు విమానంను నియంత్రించి అర్ధగంట తర్వాత హొనలులు విమానాశ్రయంలో ల్యాండ్ చేయగలిగారు. ఈ ఘటనలో మొత్తం 36మంది గాయపడ్డారు. వీరిలో 11మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

విమానం ల్యాండయిన తర్వాత.. తీవ్రమైన పరిస్థితిలో ఉన్న 11 మంది ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన వారిలో 14 నెలల చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన గాలులతో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us
బెంగళూరు స్టేడియంలో కలకలం.. మరోసారి నిషేధం విధిస్తారా..?
బెంగళూరు స్టేడియంలో కలకలం.. మరోసారి నిషేధం విధిస్తారా..?
పెళ్లి చేసుకోండి,డేటింగ్ యాప్ ఖర్చులు మేమే భరిస్తాం!ప్రభుత్వ ఆఫర్
పెళ్లి చేసుకోండి,డేటింగ్ యాప్ ఖర్చులు మేమే భరిస్తాం!ప్రభుత్వ ఆఫర్
Vinod Kambli: కాంబ్లీ ‘కమ్‌బ్యాక్’ ఐస్‌క్రీం యాడ్‌పై దుమారం..
Vinod Kambli: కాంబ్లీ ‘కమ్‌బ్యాక్’ ఐస్‌క్రీం యాడ్‌పై దుమారం..
ఎర్రటి ఎండల్లో బాడీని చల్లగా చేసే మ్యాజిక్ జ్యూస్..
ఎర్రటి ఎండల్లో బాడీని చల్లగా చేసే మ్యాజిక్ జ్యూస్..
క్రెడిట్ కార్డులు వాడేవారికి భారీ శుభవార్త
క్రెడిట్ కార్డులు వాడేవారికి భారీ శుభవార్త
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..