Optical Illusion: మాయా లేదు.. మంత్రం లేదు..! జస్ట్ ఇక్కడ పిల్లిని కనిపెడితే చాలు.. టైమ్ 10 సెకన్లే..

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లను సవాల్ చేస్తుంటాయి. చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూ మన కళ్లను మోసం చేసేలా ఉంటాయి

Optical Illusion: మాయా లేదు.. మంత్రం లేదు..! జస్ట్ ఇక్కడ పిల్లిని కనిపెడితే చాలు.. టైమ్ 10 సెకన్లే..
Optical Illusion
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 14, 2022 | 1:34 PM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లను సవాల్ చేస్తుంటాయి. చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూ మన కళ్లను మోసం చేసేలా ఉంటాయి. వాస్తవానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఆప్టికల్ భ్రమను పరిష్కరించడం అనేది.. చాలా మందికి సాధ్యం కాదు. అయితే, తక్కువ సమయంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో ఉన్న విషయాలను గుర్తిస్తే.. మన చూపు, మైండ్ షార్ప్ గా ఉన్నట్లే.. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్‌ ను ఇష్టపడుతుంటారు. వీటి ద్వారా మన మైండ్ ఎంత షార్ప్ అనేది తెలిసిపోతుంది. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా.. ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ ప్రజలలో ఉత్సాహాన్ని నింపడంతోపాటు విశ్వాసాన్ని పెంచుతుంది. సోషల్ మీడియాలో బాగా వైరలవుతోన్న ఫొటోలో బండలు, చెట్లు కనిపిస్తున్నాయి. కానీ, ఈ ఫొటోలో ఒక పిల్లి కూడా ఉంది. దానిని తదేకంగా చూస్తే కానీ కంటికి కనిపించదు. అయితే, ఇప్పుడు ఈ ఫొటోలోని ఈ పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టాలి. అలా కనుగొంటే.. మీ దృష్టి, మైండ్ షార్పుగా ఉందని అర్ధం. మరి మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను ఒకసారి చూడండి..

Optical Illusion

Optical Illusion

అయితే, పిల్లి.. బండ రాళ్లు, చెట్ల నడుమ దాక్కుని ఉంటుంది. ఇది మొదటి చూపులో గుర్తించడం కష్టమే.. అందుకే.. మరోసారి ఈ ఫొటోపై లుక్కెయండి

ఇవి కూడా చదవండి

సాధారణంగా పిల్లి ఎక్కడున్నా.. అక్కడున్న పరిసరాలతో కలిసిపోతుంది. అందుకే దానిని కనిపెట్టడం అంత ఈజీ కాదు.

మీరు ఇంకా పిల్లిని గుర్తించలేకపోతే.. ఇక్కడున్న ఫొటోను చూడండి..

Optical Illusion Cat

Optical Illusion Cat

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..