AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Dutt: ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్..? సినీ వర్గాలు ఏమంటున్నాయంటే..

ప్రేమకథాచిత్రమ్, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం వంటి సినిమాలతో సినీ ప్రేక్షకులకు దగ్గరైన టాలీవుడ్ దర్శకుడు మారుతీ. ఇటీవలే పక్కా కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతీ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర నటులలో ఒకడైన ప్రభాస్..

Sanjay Dutt: ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్..? సినీ వర్గాలు ఏమంటున్నాయంటే..
Sanjay Dutt And Prabhas
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 19, 2022 | 11:56 AM

Share

ప్రేమకథాచిత్రమ్, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం వంటి సినిమాలతో సినీ ప్రేక్షకులకు దగ్గరైన టాలీవుడ్ దర్శకుడు మారుతీ. ఇటీవలే పక్కా కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతీ దర్శకత్వంలో.. టాలీవుడ్ అగ్ర నటులలో ఒకడైన ప్రభాస్ నటించబోతున్న మూవీ సర్వత్రా ఉత్కంఠతను రేపుతోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం మారుతీ చేస్తున్న నటీనటుల ఎంపిక ఆసక్తికరంగా  మారింది. అయితే ఇంకా పేరు ప్రకటించని ఈ మూవీలో నటించబోతున్న తారాగణంలో బాలీవుడ్ నటీనటులు చాలా మంది ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇక జరీనా వహాబ్, సంజయ్ దత్ పేర్లు ఈ సినిమాలో ఉన్నారంటూ నెట్టింట చర్చలు సాగుతున్నాయి. ఇక సినిమా గురించి అందిన సమాచారం ప్రకారం ఇది ఒక హారర్-కామెడీ మూవీ. ఇందులో సంజయ్ తాత పాత్రలో, జరీనా తల్లి ఇంకా అమ్మమ్మగా పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ తెలుగులో మాత్రమే జరుగుతోంది. అందులో భాగంగానే హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని సినిమా వర్గాలు తెలిపాయి.

“జరీనా తల్లి, అమ్మమ్మగా అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోంది. జరీనా సన్నివేశాలను గత వారం హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఇది కేవలం వారం రోజుల షూటింగ్ మాత్రమే. దీంతో జరీనా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. డిసెంబరు 17న రెండో షెడ్యూల్‌ పూర్తయింది. జరీనా ఈ పాత్రను పోషించడం పట్ల సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఆమె తన కెరీర్‌లో మొదటిసారిగా ఈ పాత్రలలో నటిస్తున్నారు.  మారుతితో కలిసి పని చేయడానికి ఇంకా  తన మాతృభాష తెలుగులో పని చేయడానికి జరినా కూడా ఉత్సాహంగా ఉంది. జరీనా ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనుంది’’అని సినిమా వర్గాలు పేర్కొన్నాయి.

‘‘ఈ హర్రర్ కామెడీ మూవీని అమ్మమ్మ, తాత, మనవడు కీలక పాత్రలుగా రూపోందిస్తున్నారు. సంజయ్, జరీనా సినిమా షూటింగ్ షెడ్యూల్ ఫిబ్రవరి 2023లో ప్రారంభమవుతుంది’’ అని వారు అన్నారు. మరోవైపు ఈ సినిమాలో ముగ్గురు కొత్త నటీమణులు కూడా ఉన్నారు. “ప్రభాస్ నటించిన ఈ చిత్రంలో ముగ్గురు కొత్త అమ్మాయిలు ఉన్నారు. ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల సినిమా షూటింగ్ కంటిన్యూగా జరగదు. ప్రభాస్ డేట్స్‌ను బట్టి షూటింగ్ ప్లాన్ చేస్తారు. ఒక వారం షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తదుపరి షెడ్యూల్ డిసెంబర్ 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరుగుతుంది” అని మారుతీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి