AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar 2: అవతార్ 2 సినిమా పై ఆర్జీవీ రివ్యూ.. మనుషులంతా చచ్చిపోతారు అంటూ..

ఈ సినిమా విడుదలకు ముందే బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే  అవతార్ 2 సినిమా విడుదలకు ముందే పలు వెబ్ సైట్స్ లో దర్శనం ఇచ్చింది. పైరసీ అయినా కూడా ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ వచ్చాయి.

Avatar 2: అవతార్ 2 సినిమా పై ఆర్జీవీ రివ్యూ.. మనుషులంతా చచ్చిపోతారు అంటూ..
Rgv On Avatar 2
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2022 | 3:05 PM

Share

మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 16న అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తొలి రోజునుంచే రికార్డులు బ్రేక్ చేస్తోంది అవతార్ 2. ఈ సినిమా విడుదలకు ముందే బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే  అవతార్ 2 సినిమా విడుదలకు ముందే పలు వెబ్ సైట్స్ లో దర్శనం ఇచ్చింది. పైరసీ అయినా కూడా ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. ఇక తొలిరోజే రికార్డులను క్రియేట్ చేసింది అవతార్ 2. జేమ్స్ కామెరూన్ అవతార్ 2తో మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 సంచలనాలు సృష్టిస్తుంది.

ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అవతార్ 2 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీసెంట్ గా అవతార్ 2 సినిమా చూసిన ఆర్జీవీ.. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

అవతార్ 2లో ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు వర్మ. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉందనీ.. దేవుడు మనం నివసించే ఈ విశ్వాన్ని సృష్టిస్తే కామెరున్ “పండోరా” అనే ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు అని అన్నారు వర్మ. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే నటన, సూపర్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు వర్మ. జేమ్స్ కామెరున్ సృష్టించిన పండోర అనే ఈ అద్భుత ప్రపంచంలో ఉండాలని ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత స్వర్గం అంటే ఇలానే ఉంటుందని చెబితే మనుషులు అందరూ ఇప్పటికిప్పుడు చనిపోతారు అంటూ తన స్టైల్ లో చెప్పుకొచ్చారు వర్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చూడండి..

Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?