AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan Movie: ‘పఠాన్‌ మువీపై బీజేపీ అనవసరంగా వివాదం సృష్టిస్తోంది.. ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా..?’

బాలీవుడ్‌ బాద్‌షా.. షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన ‘బేషరమ్‌ రంగ్‌..’ పాటపై చుట్టుముడుతోన్న వివాదాలు రోజుకో రూపు దాల్చుతున్నాయి. తాజాగా దేశ రాజకీయాలకు సైతం ఈ పాటను..

Pathaan Movie: 'పఠాన్‌ మువీపై బీజేపీ అనవసరంగా వివాదం సృష్టిస్తోంది.. ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా..?'
Boycott Pathaan
Srilakshmi C
|

Updated on: Dec 19, 2022 | 8:20 AM

Share

బాలీవుడ్‌ బాద్‌షా.. షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన ‘బేషరమ్‌ రంగ్‌..’ పాటపై చుట్టుముడుతోన్న వివాదాలు రోజుకో రూపు దాల్చుతున్నాయి. తాజాగా దేశ రాజకీయాలకు సైతం ఈ పాటను ముడిపెట్టేశారు. దీనిపై వస్తోన్న విమర్శలపై రాజస్థాన్‌ క్యాబినెట్‌ మంత్రి ప్రతాప్‌సింగ్‌ కచిర్యావాస్‌ ఆదివారం (డిసెంబర్‌ 18) కీలక వ్యాఖ్యలు చేశారు. షారుక్‌ ఖాన్‌, దీపికా నటించిన ‘పఠాన్‌’ మువీపై బీజేపీ పార్టీ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంలోని అధికార పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు.

ప్రభుత్వ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ సింగ్ ఖాచిర్యావాస్ మాట్లాడుతూ.. పఠాన్ మువీకి సంబంధించి అసంబద్ధమైన అంశాలను లేవనెత్తడం ద్వారా నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం కంటే గెహ్లాట్ ప్రభుత్వం వంద శాతం మెరుగైన పనితీరును కనబరిచింది. రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను మోదీ ఎనిమిదేళ్ల పాలనతో పోల్చి చూడాలని వ్యాఖ్యానించారు.

కాగా పఠాన్‌ మువీ నుంచి మొదటి సాంగ్‌ ‘బేషరమ్ రంగ్’ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో #BoycottPathaan అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. కొందరేమో ఈ మువీ పెద్ద హిట్‌ కొడుతుందని మద్ధతుతెల్పిగా.. మరికొందరేమో ఫస్ట్‌ సాంగ్‌లో దీపికా ధరించిన దుస్తుల రంగుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక దీపికా ధరించిన కాషాయం రంగు వస్త్రాలపై రాజకీయంగా దుమారం లేపింది. దీనిపై తొలుత మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో నటి దీపికా ధరించిన దుస్తులను, దానికి సంబంధించిన సన్నివేశాలను మార్చకపోతే తమ రాష్ట్రంలో పఠాన్‌ సినిమా విడుదలను అడ్డకుంటామని బెదిరించారు. మంత్రి నరోత్తమ్ మిశ్రా బెదిరింపుల పర్వం అనంతరం ఇండోర్‌లో షారుక్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇన్ని వివాదాల మధ్య సిదార్థ్‌ ఆనంద్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పఠాన్‌’ సినిమాను జనవరి 25న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.