Badam Oil Benefits: బాదం నూనెతో అద్భుతమైన ప్రయోజనాలు.. జుట్టు సమస్యలనే కాదు.. ఈ సమస్యలనూ తగ్గిస్తుంది..
బాదం పోషకమైన డ్రైఫ్రూట్. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాదం మాత్రమే కాకుండా.. దీని నూనె కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
బాదం పోషకమైన డ్రైఫ్రూట్. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాదం మాత్రమే కాకుండా.. దీని నూనె కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. సౌందర్య ప్రయోజనాలే కాకుండా.. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఆయుర్వేదంలో కూడా బాదం నూనె సంవత్సరాలుగా అనేక ఔషదాలలో ఉపయోగిస్తారు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. బాదం నూనె జుట్టు సమస్యలను తగ్గించడమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
బాదం నూనెలో ఉండే పోషకాలు.. బాదం నూనెలో కొవ్వులు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంది. ఇది తల నుంచి కాలి వరకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా చర్మం , జుట్టును ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఎ, విటమిన్ డి, ఇ, కె వంటి విటమిన్లు ఉన్నాయి.
బాదం నూనె ప్రయోజనాలు.. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.. ఓ నివేదికలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనితో పాటు మొటిమలు, తామర, చర్మశోథ వంటి అనేక రకాల చర్మ వ్యాధులను తొలగించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కొత్త చర్మ కణాల ఏర్పాటులో సహాయపడుతుంది. ముఖంపై ఉండే ఫైన్ లైన్స్ ను తొలగిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, సోరియాసిస్, గాయాలు మానకపోవడం వంటి సమస్యలు వస్తాయి. బాదం నూనెను రాసినప్పుడు మొటిమలు, బ్యాక్టీరియా పెరుగుదల, చర్మశోథ లక్షణాలు, జుట్టు రాలడం మొదలైన వాటిని తగ్గిస్తుంది.
జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.. జుట్టు జిడ్డుగా ఉన్నా, పొడిగా ఉన్నా బాదం నూనె అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం బాదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. తలలో దురద, చుండ్రు, ఎర్రబారడం వంటి సమస్యలు ఉంటే బాదం నూనె రాసుకుంటే మంట తగ్గుతుంది. దురద స్కాల్ప్ ను హెల్తీగా మార్చుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.. ఓ నివేదిక ప్రకారం.. మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కలిగిన నూనెలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తాయని రుజువైంది. ఈ రెండు మూలకాలు బాదం నూనెలో ఉంటాయి. దీంతో ఈ నూనె టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ ను అల్పాహారంగా తినేవారిలో ఈ నూనె తీసుకోని వారి కంటే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అదే సమయంలో వారు తక్కువ ఆకలిని కలిగి ఉన్నాడు.
హృదయానికి అవసరం.. ఈ నూనె గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్, మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు ఈ నూనెను తీసుకోవడం మంచిది. ఇది హృదయనాళ వ్యవస్థ, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు తగ్గిస్తుంది.. ఈ నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి అధిక బరువుతో ఇబ్బందిపడేవారు బాదం నూనె తీసుకోవడం మంచిది. అలాగే జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించడంతోపాటు.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాదం నూనె పనిచేస్తుంది. అతిసారం, మలబద్ధకం, గ్యాస్, కడుపులో మంట, పేగు సమస్యలు వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో ప్రభావంతంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండని వారు ఈ నూనెలో ఆహారాన్ని ఉడికించి తీసుకోవడం మంచిది.
గమనిక: – ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు, ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 దృవీకరించలేదు. వీటిని అమలు చేసేముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
Also Read: Gentleman 2 : జెంటిల్‌మేన్ 2లో మరో హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్.. ఎవరంటే..
James: ఓటీటీలో సందడి చేయనున్న మరో రెండు సూపర్ హిట్స్.. పునీత్ చివరి మూవీతోపాటు..
KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్ ట్వీట్.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?