Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?

సోనూసూద్‌.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌.. కరోనా సంక్షోభం (Corona Crisis)లో రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?
Sonu Sood
Follow us

|

Updated on: Apr 13, 2022 | 10:11 PM

సోనూసూద్‌.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌.. కరోనా సంక్షోభం (Corona Crisis)లో రియల్‌ హీరో అనిపించుకున్నాడు. వలస కార్మికులు, నిరుపేదలకు ఆపన్నహస్తం అందించి వారి పాలిట దేవుడిగా మారాడు. సహాయ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అందులో అడిగిన వారందరికీ వీలైనంతవరకు సాయం చేశాడు. అయితే అప్పుడప్పుడు కొందరు నెటిజన్లు చిత్ర, విచిత్రమైన ప్రశ్నలు అడిగి సోనూను ఇబ్బంది పెట్టారు. ఇటీవల ఓ అభిమాని ఏకంగా చల్లటి బీరు కావాలని ఈ నటుడిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌ లో ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టినా, ప్రశ్నలు వేసినా వాటిని సానుకూలంగా తీసుకున్నాడు సోనూసూద్‌ (Sonu Sood). తనదైన శైలిలో వాటికి సమాధానాలిచ్చి అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఇప్పుడు అలాంటి రిక్వెస్టే ఒకటి సోనూకు చేరింది. దానికి అతరె స్పందించిన తీరు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఆ రక్తంతో బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభించండి..

ఇంతకీ నెటిజన్ ఏమడిగాడంటే.. ‘సోదరా.. మీరు అడిగిన వారందరికీ ఆపన్నహస్తం అందిస్తున్నారు. అలా నాకు కూడా ఓ హెల్ప్‌ చేయండి. నా భార్య నా రక్తం బాగా తాగుతోంది. దీనికి ఏమైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి నాకు సహాయం చేయండి. ఒక భార్యాబాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను’ అని సోనూను అడిగాడు. దీనికి స్పందించిన అతను ‘అది ప్రతీ భార్య జన్మహక్కు సోదరా.. మీరు కూడా నాలాగే అదే రక్తంతో బ్లడ్ బ్యాంకు ప్రారంభించండి’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తన ఆన్సర్‌కు ఒక ఫన్నీ ఎమోజీని కూడా జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. సోనూసూద్‌ ఇచ్చిన రిప్లై చూసి ‘భలే ఇచ్చావ్‌ బ్రదర్‌’, ‘మీ సెన్సాఫ్‌ హ్యూమర్‌ సూపర్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 29న ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. చాలా కష్టం

Sunny Leone: స్పీడ్ పెంచిన సన్నీ లియోన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ..

Hyderabad: మహా నగరం సిగలో మరో మణిహారం! ..10 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ నిర్మాణానికి టెండర్‌ నోటిఫికేషన్‌..