Sunny Leone: స్పీడ్ పెంచిన సన్నీ లియోన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ..

ఒకప్పుడు ఆమె అప్పియరెన్స్ ఉంటేనే సినిమాకు బోలెడంత కమర్షియల్ వెయిట్ పెరిగేది. తర్వాత ఫస్ట్ క్లాస్ మూవీస్ ఆమెను పూర్తిగా ఎవాయిడ్ చేశాయి.

Sunny Leone: స్పీడ్ పెంచిన సన్నీ లియోన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ..
Sunny Leone
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2022 | 9:01 PM

ఒకప్పుడు ఆమె అప్పియరెన్స్ ఉంటేనే సినిమాకు బోలెడంత కమర్షియల్ వెయిట్ పెరిగేది. తర్వాత ఫస్ట్ క్లాస్ మూవీస్ ఆమెను పూర్తిగా దూరం చేశాయి. ఇప్పుడు చిన్నాచితకా సినిమాల్లో సాదాసీదా పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. ఉవ్వెత్తున ఎగిసపడ్డ ఆ గ్లామర్ తరంగం ఎవరా అని ఆలోచిస్తున్నారా.. సరిగ్గా పదేళ్ల కిందట పూజా భట్‌ డైరెక్షన్‌లో జిస్మ్‌2 సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు సన్నీ లియోన్(Sunny Leone). పోర్న్‌ స్టార్ అనే ఇమేజ్‌ని గట్టున పెట్టి.. బార్డర్లు దాటి ఇండియాలోకొచ్చి.. ఇక్కడి గ్లామర్‌ ప్రపంచాన్ని బాగానే ఏలేశారు. కెనడా బ్యూటీ సన్నీ లియోన్ ప్రజంట్ కేరాఫ్ ఎక్కడ అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు.

తెలుగులో కరెంటు తీగలా వచ్చి.. మరికొన్ని ఐటమ్ సాంగ్స్‌తో యూత్ ఆడియన్స్‌ గుండెల్లో గుబులు పుట్టించేశారు. కట్‌ చేస్తే, మళ్లీ టాలీవుడ్డే దిక్కయింది మేడమ్‌ సన్నీకి. మంచు విష్ణు సినిమాలో పాయల్‌తో పాటు మరో హీరోయిన్‌గా చేస్తున్నారు సన్నీ. రీసెంట్‌గా వీళ్లిద్దరూ కలిసి చేసిన రీల్స్‌,నవ్వులు పూయిస్తున్నప్పటికీ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతున్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి స్క్రీన్ అప్పియరెన్స్ లేక.. బిహైండ్ ది సీన్స్‌తోనే టైమ్‌పాస్ చేస్తున్నారు సన్నీ. ఇప్పుడు మళయాళంలో రంగీలా, తమిళ్‌లో షీరో, వీరమాదేవి, ఓ మై ఘోస్ట్ సినిమాల్లో నటిస్తున్నారు. హిందీలో కూడా రెండుమూడు ప్రాజెక్టులున్నా అవెప్పుడొస్తాయో నమ్మకాల్లేవు. వీటన్నిటికంటే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మంచు విష్ణు మూవీతోనే బేబీ డాళ్‌ని స్క్రీన్ మీద చూసే ఛాన్సుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

K.G.F Chapter 2: రిలీజ్‌కు రెడీ అయిన కేజీఎఫ్‌2…రాకీ భాయ్‌కి అక్కడ అరుదైన గౌరవం.. ఏకంగా

Hollywood: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు కన్నుమూత.. గౌరవార్ధం నవ్వమని కోరిన కుటుంబ సభ్యులు

Sonal Chauhan: ప్రభాస్ సరసన బాలయ్య హీరోయిన్.. అదృష్టంగా భావిస్తున్నా అంటున్న అమ్మడు..