K.G.F Chapter 2: రిలీజ్‌కు రెడీ అయిన కేజీఎఫ్‌2…రాకీ భాయ్‌కి అక్కడ అరుదైన గౌరవం.. ఏకంగా

ప్రస్తుతం సినీ లావర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్ 2. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

K.G.F Chapter 2: రిలీజ్‌కు రెడీ అయిన కేజీఎఫ్‌2...రాకీ భాయ్‌కి అక్కడ అరుదైన గౌరవం.. ఏకంగా
Kgf 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2022 | 6:52 PM

ప్రస్తుతం సినీ లావర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్ 2(K.G.F Chapter 2). కన్నడ రాకింగ్ స్టార్ యశ్(Yash) హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ పార్ట్ 1 ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటటైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు హీరో యశ్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు యశ్ చాలా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు కేజేఎఫ్ పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు ( 14న ) ఈ సినిమా ప్రపంచవ్యాప్తగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏లోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో యశ్ చెప్పిన డైలాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమానుంచి ధీర ధీర సుల్తానా.. పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫుల్ ఎనర్జిటిక్ గా ఈ పాట సాగింది. యశ్ హీరోయిజాన్ని తెలుపుతూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ముంబై లో కేజీఎఫ్ 2 సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే ముంబైలో హీరో యశ్ 100 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు. ఇక ఈ సినిమా కోసం కేవలం మనదేశంలోని ప్రేక్షకులే కాదు.. విదేశాల్లోని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది.దాంతో కేజీఎఫ్ సినిమా వసూళ్ళలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం కన్ఫామ్ గా కనిపిస్తుంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే