Sonal Chauhan: ప్రభాస్ సరసన బాలయ్య హీరోయిన్.. అదృష్టంగా భావిస్తున్నా అంటున్న అమ్మడు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలనీ భారీ బడ్జెట్ సినిమాలే.. ఇటీవలే రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డార్లింగ్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

Sonal Chauhan: ప్రభాస్ సరసన బాలయ్య హీరోయిన్.. అదృష్టంగా భావిస్తున్నా అంటున్న అమ్మడు..
Sonal Chauhan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2022 | 5:50 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాలనీ భారీ బడ్జెట్ సినిమాలే.. ఇటీవలే రాధేశ్యామ్(Radhe Shyam)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డార్లింగ్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమాపైనే దృష్టి పెట్టారు ఫ్యాన్స్. ఈ సినిమాతో ఎలాగైనా ప్రభాస్ బ్లక్ బస్టర్ హిట్ కొడతాడని ధీమాగా ఉన్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ ఒకటి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. రామాయణ గాధ ఆధారంగ తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తోన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా.. ఈ సినిమాను 3D వెర్షన్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటించనున్నారు. తాజాగా ఈ మూవీలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఓ ముద్దుగుమ్మ. ఆ అమ్మడు ఎవరో కాదు సోనాల్ చౌహన్. నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాలయ్య సరసన నటించి ఆకట్టుకుంది ఈ భామ. ప్రస్తుతం అనీల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఎఫ్ 3లో నటిస్తుంది. అలాగే నాగార్జున హీరోగా చేస్తున్న ‘ఘోస్ట్’ సినిమాలో కూడా సోనాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి ఏకంగా ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కిందని తెలుస్తుంది. ఆదిపురుష్ సినిమాలో కీలక పాత్రలో సోనాల్ చౌహన్ నటిస్తుంది. తాజాగా ఓ ఇంట్రవ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ.. నేను నటిస్తున్న తొలి పౌరాణిక సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆదిపురుష్ సెట్ లో మరో ప్రపంచాన్ని చూశాను అంటూ చెప్పుకొచ్చింది సోనాల్.

మరిన్ని ఇక్కడ చదవండి :