Ranbir Kapoor and Alia Bhatt: బాలీవుడ్ లవ్ బర్డ్స్‌కు లవ్లీ విషెస్ తెలిపిన బ్రహ్మస్త్ర టీమ్..
బాలీవుడ్ ప్రేమ పక్షలు రణబీర్ కపూర్( Ranbir Kapoor) , అలియా భట్(Alia Bhatt) గురించి ప్రతిరోజు ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే వస్తుంది.
బాలీవుడ్ ప్రేమ పక్షలు రణబీర్ కపూర్( Ranbir Kapoor) , అలియా భట్(Alia Bhatt) గురించి ప్రతిరోజు ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే వస్తుంది. ఈ ఇద్దరి పెళ్లి ఇప్పుడు బాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది. రణబీర్ కపూర్, అలియా భట్ తమ రిలేషన్‌షిప్‌ను ధృవీకరించినప్పటి నుంచి అభిమానులు వారి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు. రోజురోజుకు వీరి పెళ్లి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లిపనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ముందుగా వీరిద్దరూ పెళ్లి ఏప్రిల్ 14న పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్ వినిపించింది. ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి ఏప్రిల్ 20కి వాయిదా పడినట్టుగా టాక్ నడుస్తోంది. అయితే రణబీర్, అలియా మాత్రం ఇప్పటి వరకు తమ పెళ్లి గురించి మౌనంగానే ఉన్నారు. పంజాబీ ఆచారాల ప్రకారం రణబీర్, అలియా పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తుంది. కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వీరి పెళ్లి జరగనుంది.
అలియా, రణబీర్ పెళ్లి వేడుకలలో భాగంగా రణబీర్ తల్లి నీతూ కపూర్, వధువు తండ్రి మహేష్ భట్, రీమా జైన్ , ఇతర కుటుంబ సభ్యులు పాలి హిల్ హౌస్‌లో గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా టీం తరపున కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ రణబీర్ సన్నిహిత మిత్రుడు అయాన్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ఈ ఇద్దరికీ విషెస్ తెలుపుతూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ముఖర్జీ. ఈ వీడియో అలియా , రణబీర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్రహ్మాస్త్ర మొదటి పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Nivetha Pethuraj: గ్లామర్ డోస్ పెంచేసిన నివేత పేతురాజ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
Rashmi Gautam:పింక్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ రష్మి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
Beast Movie Review: నవ్విస్తూ, ఎమోషనల్‌గా ఎంటర్టైన్ చేసిన బీస్ట్..