Sonam Kapoor: హీరోయిన్ ఇల్లు గుల్ల.. సాంతం దోచుకెళ్లిన దొంగ !!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. న్యూఢిల్లీలోని సోనమ్ కపూర్ ఇంట్లో దాదాపు రూ.2.40 కోట్ల నగదు.. నగలు చోరీకి గురైనట్లు సోనమ్ కపూర్ అత్తమామలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. న్యూఢిల్లీలోని సోనమ్ కపూర్ ఇంట్లో దాదాపు రూ.2.40 కోట్ల నగదు.. నగలు చోరీకి గురైనట్లు సోనమ్ కపూర్ అత్తమామలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా తల్లిదండ్రులు హారీష్ అహుజా, ప్రియా అహుజా ఢిల్లీలోని లుటియన్స్‌లోని అమృత షెర్గిల్ మార్గ్‌లోని ఇంట్లో నివసిస్తున్నారు. ఫిబ్రవరిలో వారింట్లో దొంగతనం జరిగిందని.. దీంతో వారు వెంటనే.. ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాదాపు రూ.2.40 కోట్లు విలువైన నగదు.. విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Watch:
Sitara Ghattamaneni: సితార కూచిపూడి నృత్యం చూసి పొంగిపోయిన మహేష్ !!
Jabardasth Apparao: ఎన్నో అవమానాలు భరించాను !! అందుకే జబర్దస్త్ వదిలేశా !!
మహేష్‌కు విలన్‌గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న