Heat Rashes: ఎండాకాలం హీట్ ర్యాషెస్ సమస్య వేధిస్తుందా.. ఇంట్లోనే వీటిని ట్రై చేయండి..!
Heat Rashes: ఎండాకాలంలో వచ్చే సాధారణ సమస్య హీట్ ర్యాషెస్. ఇది చర్మ రంధ్రాలు మూసుకోవడం వల్ల ఏర్పడుతుంది. చాలా మందికి వీపు లేదా మెడపై హీట్ ర్యాషెస్ వస్తాయి.
Heat Rashes: ఎండాకాలంలో వచ్చే సాధారణ సమస్య హీట్ ర్యాషెస్. ఇది చర్మ రంధ్రాలు మూసుకోవడం వల్ల ఏర్పడుతుంది. చాలా మందికి వీపు లేదా మెడపై హీట్ ర్యాషెస్ వస్తాయి. దీని కారణంగా దురద, మంట ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న గాయాలు కూడా ఏర్పడుతాయి. దీని నుంచి బయటపడటానికి మార్కెట్లో కొన్ని రకాల పౌడర్ల అమ్ముతున్నారు. కానీ ఇవి కొంతవరకే ఉపశమనం కలిగిస్తాయి. ఇలాంటి వేడి దద్దుర్లని నయం చేయడానికి కొన్ని హోం రెమిడీస్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందులో ముఖ్యమైనది దోసకాయ. వేసవిలో ప్రతి ఇంట్లోనూ దోసకాయ ఉంటుంది. దీనిని సన్నని ముక్కలుగా కట్ చేసి, కాసేపు ఫ్రిజ్‌లో పెట్టండి. చల్లబడగానే తీసుకుని హీట్ ర్యాషెస్‌పై రుద్దండి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు ప్రయత్నించండి. తొందరలోనే తగ్గిపోతాయి.
ముల్తాని మట్టి
ముల్తాని మట్టి వేడి దద్దుర్లని నయం చేయడంలో సహాయపడుతుంది. దీన్ని అప్లై చేయడం వల్ల దురదలు, మంటలు కూడా తగ్గుతాయి. ఇందుకోసం ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలపండి. ఈ పేస్ట్‌ని వేడి దద్దుర్లపై రుద్దండి. ఇది ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ముల్తాని మట్టి ప్యాక్ మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది.
అలోవెరా జెల్
అలోవెరా జెల్ చర్మాన్ని చల్లబరుస్తుంది. చికాకును తగ్గిస్తుంది. రోజూ రాత్రి పడుకునే సమయంలో అలోవెరా జెల్‌ను హీట్ ర్యాషెస్ ఉన్న చోట రాసుకుంటే చాలా ఉపశమనం కలుగుతుంది. కావాలంటే ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తర్వాత అప్లై చేయాలి. ఇది మీకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ర్యాషెస్ సమస్యలని తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంలో రాయండి. ఇది మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది.
శెనగపిండి
శెనగపిండిలో చల్లటి నీటిని కలిపి పేస్ట్‌లా చేసి వేడిదద్దుర్లపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది కాకుండా 2-3 ఐస్ క్యూబ్స్‌ను కాటన్ క్లాత్‌లో తీసుకొని వేడిదద్దుర్లపై ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. చాలా ఉపశమనం కలుగుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.