Gastric Problem: రాత్రిపూట గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఇది తప్పనిసరిగా తెలుసుకోండి..

Gastric Problem in Night Time: సాధారణంగా తీసుకునే ఆహారం, సరిగా తినకపోవడం తదితర కారణంగా చాలామంది పలు ఉదర సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వాటిలో ప్రధానంగా గ్యాస్ట్రిక్

Gastric Problem: రాత్రిపూట గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఇది తప్పనిసరిగా తెలుసుకోండి..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 14, 2022 | 11:17 AM

Gastric Problem in Night Time: సాధారణంగా తీసుకునే ఆహారం, సరిగా తినకపోవడం తదితర కారణంగా చాలామంది పలు ఉదర సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వాటిలో ప్రధానంగా గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. చాలామంది రాత్రిపూట కడుపులో గ్యాస్ ఏర్పడటం, నొప్పి వంటి సమస్యలను కలిగి ఉంటారు. పొట్టలో గ్యాస్ కారణంగా నిద్రపోతున్నప్పుడు అశాంతి ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, తేపులతో నిద్ర కూడా సరిగా పట్టదు. చాలా సార్లు ఈ సమస్య పెరిగినప్పుడు కడుపులో నొప్పి కూడా వస్తుంది. ఇంకా కొంతమందికి కడుపులో మంటగా కూడా అనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితిలో రాత్రి వేళ మాత్రమే గ్యాస్ ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వెనుక కారణం ఏమిటి.. ఎలా నివారించాలి? అనే విషయాలను తెలుసుకుందాం..

రాత్రివేళ గ్యాస్ ఎందుకు ఏర్పడుతుందంటే..?

ఆహారం తిన్న తర్వాత.. దానిని జీర్ణం చేసే పని ప్రారంభమైనప్పుడు కడుపులో గ్యాస్ వేగంగా ఏర్పడుతుంది. జీర్ణక్రియ ప్రక్రియ సరిగా జరగపోయినా..భారీగా ఆహారాన్ని తిన్నా మరింత గ్యాస్ ఏర్పడుతుంది. గ్యాస్ ఏర్పడే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. దీంతోపాటు రాత్రిపూట ఎక్కువ ఆహారం తీసుకోకూడదు.

ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి సుమారు 6 గంటలు పడుతుంది. మధ్యాహ్న భోజనంతో సహా గత 6 గంటల్లో మీరు ఏది తిన్నా కూడా మీ కడుపులో గ్యాస్ ఏర్పడవచ్చు. అలాంటప్పుడు రాత్రిపూట ఎంత తేలికైన ఆహారం తింటే అంత మంచిది. లేకపోతే రాత్రి నిద్రపోతున్నప్పుడు కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది.

రాత్రిపూట గ్యాస్ ఏర్పడటానికి మరొక కారణం అధిక ఫైబర్ ఆహారం. అధిక ఫైబర్ ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది గ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. రాత్రి భోజనంలో బీన్స్, బఠానీలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినవద్దు.

రాత్రిపూట గ్యాస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

1- రాత్రి భోజనం తర్వాత, కనీసం 20 నిమిషాలు నడవండి. ఆహారం తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.

2- మీరు రోజంతా కనీసం 10-12 గ్లాసుల నీరు తాగాలి. ఆహారం బాగా జీర్ణం కావడానికి, పోషకాలను బాగా గ్రహించడానికి తగినంత నీరు తాగాలి. తక్కువ నీరు తాగడం వల్ల రాత్రిపూట గ్యాస్ సమస్య పెరుగుతుంది.

3- ఆహారం క్రమ పద్దతి ప్రకారం తినకపోయినా.. అధికంగా గ్యాప్ ఉన్నా గ్యాస్ సమస్య మొదలవుతుంది. భోజనం మధ్య చాలా గ్యాప్ కారణంగా గ్యాస్ వేగంగా ఏర్పడటం ప్రారంభమవుతుంది. దీన్ని నివారించడానికి భోజనం భోజనానికి మధ్య ఆరోగ్యకరమైన పండ్లను తినడం మంచిది.

Also Read:

Heat Rashes: ఎండాకాలం హీట్‌ ర్యాషెస్‌ సమస్య వేధిస్తుందా.. ఇంట్లోనే వీటిని ట్రై చేయండి..!

Badam Oil Benefits: బాదం నూనెతో అద్భుతమైన ప్రయోజనాలు.. జుట్టు సమస్యలనే కాదు.. ఈ సమస్యలనూ తగ్గిస్తుంది..