Health Tips: వినికిడి లోపం రావడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం..!
Health Tips: ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వారికి తెలియకుండానే వినికిడి లోపానికి గురవుతున్నారు. ముఖ్యంగా బిగ్గరగా టీవీ చూడటం, పాటలు బిగ్గరగా వినడం, అర్థం
Health Tips: ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వారికి తెలియకుండానే వినికిడి లోపానికి గురవుతున్నారు. ముఖ్యంగా సౌండ్ ఎక్కువగా పెట్టుకొని టీవీ చూడటం, పాటలు బిగ్గరగా వినడం, బిగ్గరగా మాట్లాడటం వినికడి లక్షణాలుగా చెప్పవచ్చు. వీటిని ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే సమస్య పెద్దది కాకుండా నిరోధించవచ్చు. వాస్తవానికి ఏ వయసులోనైనా వినికిడి లోపం ఏర్పడుతుంది. వయసు పెరిగే కొద్దీ వినికిడి లోపం తగ్గడం సహజం. 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబంలో ఇంతకు ముందు చెవిటివారు ఉండటం, చెవిపోటు, చెవి నిర్మాణంలో లోపాలు. పెద్ద శబ్దాలు చేసే యంత్రాల దగ్గర పనిచేయడం ఇతర కారణాలుగా చెప్పవచ్చు.
1. చెవులను తడిగా ఉంచుకోవడం
తరచుగా చెవులు తడిగా ఉండటం మంచిదికాదు. ఇలా చేయడం వల్ల చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ (ఆటోమైకోసిస్) వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా ఈతగాళ్లలో కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌కి కారణం ఆస్పర్‌గిల్లస్, కాండిడా అనే బ్యాక్టీరియా. ఇది తేమ కారణంగా వేగంగా వ్యాపిస్తుంది.
2. బిగ్గరగా సంగీతం వినడం
మీరు బిగ్గరగా సంగీతం వినడానికి ఇష్టపడితే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. బిగ్గరగా సంగీతం వినడం వల్ల చెవి పని చేసే సామర్థ్యం దెబ్బతింటుంది. నిరంతరం బిగ్గరగా సంగీతం వినడం వల్ల మీ వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది.
3. చెవుల్లో ఇయర్‌బడ్‌లు, పిన్‌లను పెట్టుకోవద్దు. స్నానం చేసేటప్పుడు చెవిలో నీరు పోయడం మానుకోండి. పెద్ద శబ్దాల దగ్గర పనిచేసేటప్పుడు చెవిలో దూది పెట్టుకోండి. బిగ్గరగా టీవీ లేదా పాటలు వినవద్దు. చెవులని జాగ్రత్తగా చూసుకోవాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.