AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket News: ఏడో స్థానంలో బ్యాటింగ్‌.. 18 బంతుల్లో 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ..!

Cricket News: క్రికెట్‌లో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. పాత రికార్డులు బ్రేక్ అవుతాయి కొత్త రికార్డులు నమోదవుతాయి. కొన్నిసార్లు కొన్ని రికార్డులు త్రుటిలో మిస్‌ అవుతూనే ఉంటాయి.

Cricket News: ఏడో స్థానంలో బ్యాటింగ్‌.. 18 బంతుల్లో 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ..!
Michael Leask
uppula Raju
|

Updated on: Apr 14, 2022 | 12:52 PM

Share

Cricket News: క్రికెట్‌లో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. పాత రికార్డులు బ్రేక్ అవుతాయి కొత్త రికార్డులు నమోదవుతాయి. కొన్నిసార్లు కొన్ని రికార్డులు త్రుటిలో మిస్‌ అవుతుంటాయి. అలాగే ఒక బ్యాట్స్‌మెన్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 18 బంతుల్లో ఆరు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. 31 ఏళ్ల స్కాటిష్ బ్యాట్స్‌మెన్ మైఖేల్ లిస్క్‌ ఈ ఫీట్‌ సాధించాడు. వాస్తవానికి అంతర్జాతీయ ODIలో 16 బంతుల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదైంది. దీనిని 2015 సంవత్సరంలో AB డివిలియర్స్ సృష్టించాడు. అసోసియేట్ నేషన్స్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా అవతరించడానికి మైఖేల్ లిస్క్‌కి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. 7వ ర్యాంక్‌లో ఉన్న మైఖేల్ లిస్క్ చేసిన వేగవంతమైన అర్ధ సెంచరీతో స్కాట్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో 16 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ప్రపంచ రికార్డు ఒక్కరిపైనే ఉంది. 17 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించిన వారు ముగ్గురు ఉన్నారు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వారు మొత్తం 8 మంది ఉన్నారు. స్కాట్లాండ్ నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పపువా న్యూ గినియా జట్టు 164 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్‌ 123 పరుగుల తేడాతో ఓడిపోయింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

IPL 2022లో అత్యంత పొడవైన సిక్స్.. ఈ18 ఏళ్ల బ్యాట్స్‌మెన్ పేరిట నమోదైంది..

Heat Rashes: ఎండాకాలం హీట్‌ ర్యాషెస్‌ సమస్య వేధిస్తుందా.. ఇంట్లోనే వీటిని ట్రై చేయండి..!

Mahavir Jayanti 2022: నేడు భగవాన్ మహావీర్ జయంతి.. ఆయన చెప్పిన సూత్రాలు అందరికి ఆదర్శప్రాయం..!