- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 longest six 112 meters recorded on mumbai indians dewald brevis
IPL 2022లో అత్యంత పొడవైన సిక్స్.. ఈ18 ఏళ్ల బ్యాట్స్‌మెన్ పేరిట నమోదైంది..
IPL 2022: ఐపీఎల్‌లో అత్యంత పొడవైన సిక్స్‌లు ఆరుగురు బ్యాట్స్‌మెన్ల పేరుపై నమోదయ్యాయి. అందులో ఈ 18 ఏళ్ల బ్యాట్స్‌మెన్
Updated on: Apr 14, 2022 | 9:29 AM

ఐపీఎల్‌లో అత్యంత పొడవైన సిక్స్‌లు ఆరుగురు బ్యాట్స్‌మెన్ల పేరుపై నమోదయ్యాయి. అందులో ఈ 18 ఏళ్ల బ్యాట్స్‌మెన్ అందరికంటే ముందున్నాడు.

దక్షిణాఫ్రికా అండర్ 19 ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అత్యంత పొడవైన సిక్స్ కొట్టాడు. వాస్తవానికి ఎప్పుడు అతడు దీని గురించి ఆలోచించి ఉండడు.

డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. IPL 2022లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 మీటర్ల సిక్స్‌ని సాధించాడు.

డెవాల్డ్ బ్రెవిస్ తర్వాత పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న లియామ్ లివింగ్‌స్టన్ 108 మీటర్ల సిక్సర్ కొట్టాడు. ఇప్పటి వరకు టోర్నీలో ఇది రెండో పొడవైన సిక్స్. 105 మీటర్ల దూరం సిక్స్‌తో లివింగ్‌స్టన్ మూడో పొడవైన సిక్స్ కొట్టిన వ్యక్తిగా నిలిచాడు.

దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 102 మీటర్ల దూరంతో ఆడిన శివమ్ దూబే నాలుగో స్థానంలో ఉన్నాడు. అంటే ఓవరాల్‌గా చూస్తే పొడవాటి సిక్స్ కొట్టిన మొదటి వ్యక్తి బ్రెవిస్.



