MS Dhoni: ధోనీ ఫీల్డింగ్ సెట్ చేస్తే ఇట్లుంటది మరి.. కోహ్లీని ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..
MS Dhoni: ఇండియన్ క్రికెట్ హిస్టరీ గురించి మాట్లాడితే ధోనీ పేరు పేరును ప్రస్తావించుకుండా ఉండడం అసాధ్యం. టీమిండియాకు (Team India) ఆయన అందించిన విజయాలు అలాంటివి. టీ 20, వన్డే వరల్డ్ కప్‌లను అందించిన మేటిగాడు ధోని. కెప్టెన్‌గా కూల్ నిర్ణయాలు...
MS Dhoni: ఇండియన్ క్రికెట్ హిస్టరీ గురించి మాట్లాడితే ధోనీ పేరు పేరును ప్రస్తావించుకుండా ఉండడం అసాధ్యం. టీమిండియాకు (Team India) ఆయన అందించిన విజయాలు అలాంటివి. టీ 20, వన్డే వరల్డ్ కప్‌లను అందించిన మేటిగాడు ధోని. కెప్టెన్‌గా కూల్ నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు బ్యాటింగ్‌తో బౌలర్లను భయబ్రాంతులకు గురి చేసే ధోని క్రీజులో ఉంటే చాలు హంగామా మాములుగా ఉండదు. ఇక కేవలం ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనే కాకుండా ఐపీఎల్ (IPL)లోనూ ధోని తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరించిన ధోని, చెన్నైని పలుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
ఇదిలా ఉంటే కెప్టెన్‌గా ఉన్నా లేకున్నా జట్టు విజయానికి తన సలహాలను ఇస్తూనే ఉంటాడు ధోని. ఇలా తాను ఇచ్చిన సలహాలు ఎన్నోసార్లు జట్టును విజయానికి చేర్చాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని తన మార్క్‌ను మరోసారి చూపించాడు. వికెట్ల వెనక ఉంటూ ఫీల్డింగ్ సెట్ చేయడంలో ధోనిది అందె వేసిన చేయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన మ్యాచ్‌లో తన చతురత ప్రదర్శించి విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన్న చెన్నై 20 ఓవర్లలో 216 పరుగులు చేసింది. అయితే అనంతరం చెన్నై బౌలింగ్‌లో రాణించడంతో బెంగళూరును చిత్తు చేసి 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ జరుగుతోన్న సమయంలో ధోని ప్రదర్శించిన చతురత కోహ్లిని పెవిలియన్ బాట పట్టేలా చేసింది. కోహ్లీ క్రీజులో ఉన్న సమయంలో ‘డీప్ స్వ్కేర్ లెగ్’ పొజిషన్‌లో ఫీల్డర్ లేడు. అయితే విరాట్ అవుట్ అయ్యే ముందే ధోనీ ఆ ప్లేస్‌ను భర్తీ చేస్తూ అక్కడికి ఒక ఫీల్డర్‌ను పంపించాడు. దీంతో తర్వాతి బంతికే విరాట్ నేరుగా సదరు ‘డీప్ స్వ్కేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ధోని ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
— Addicric (@addicric) April 12, 2022
Bank Transaction: తప్పుడు ఖాతాకు పొరపాటున డబ్బు పంపారా.. ఇలా చేస్తే మీ మనీ బ్యాక్..
IMD Weather Update: రైతులకు చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక ఎప్పుడంటే.!