IPL 2022: ఈ 4 తప్పులే ముంబై ఓటములకు కారణం.. విలన్‌గా మారిన రోహిత్ శర్మ.. ఇంతకీ అవేంటంటే!

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సొంతం..

IPL 2022: ఈ 4 తప్పులే ముంబై ఓటములకు కారణం.. విలన్‌గా మారిన రోహిత్ శర్మ.. ఇంతకీ అవేంటంటే!
Mumbai Indians
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 14, 2022 | 5:21 PM

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఆశించినా.. మరోసారి నిరాశే ఎదురైంది. ఈ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టైనా ముంబై.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. విజయం కోసం తహతహలాడుతోంది. అలాగే టాప్ 4 రేస్ నుంచి దాదాపుగా ముంబై జట్టు నిష్క్రమించిందని చెప్పాలి. ఈ బ్యాడ్ స్టార్ట్ తర్వాతైనా ముంబై ఇండియన్స్‌కు కలిసొస్తుందా అంటే.? ఆ మేరకు ఎలాంటి సంకేతాలు కనిపించట్లేదు.

విజయం కోసం తహతహలాడుతోన్న ముంబై జట్టు:

ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ చేతుల్లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తర్వాతి మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో జరగ్గా.. ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌.. ముంబైపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆర్సీబీ.. ముంబైపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఐదో మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా ముంబై ఇండియన్స్ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ పరాజయాలు చవి చూసింది. ఈ 5 ఓటములు ఫ్యాన్స్‌ ముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను విలన్‌గా మార్చాయి.

ఫస్ట్ రీజన్:

ఐపీఎల్ 2022కు ముందు మెగా వేలం జరిగింది. అంతకంటే ముందు ప్రతీ జట్టు 4గురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకున్నాయి. ఇక ముంబై కూడా నలుగురిని తమతో అట్టేపెట్టుకుంది. వాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, జస్ప్రిత్ బుమ్రా. ఇక వేలంలో ముంబై ఇండియన్స్ తమ దగ్గరున్న డబ్బులలో ఎక్కువ శాతం ఇషాన్ కిషన్ కోసం వెచ్చించింది. అతడ్ని ఏకంగా రూ. 15.25 కోట్లు కొనుగోలు చేసింది. మిగిలిన కొంత డబ్బుతో పేలవమైన ఆటగాళ్ళను తీసుకుంది. ఒక్క ఆటగాడి మీద ఇంత మొత్తం వెచ్చించడం కరెక్ట్ ఆప్షన్ కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అది సరైన పద్దతి కాదని తప్పుబడుతున్నారు.

రెండో రీజన్:

ముంబై ఇండియన్స్ ప్రధాన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. మెగా ఆక్షన్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ముంబై కొనుగోలు చేసినప్పటికీ అతడు వచ్చే ఏడాది గానీ అందుబాటులో ఉండదు. ఇక ప్రస్తుతం బుమ్రాకు తోడూ నిలిచే మరే బౌలర్ లేడు. ముంబై ఫాస్ట్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. జైదేవ్ ఉనద్కత్, టైమల్ మిల్స్, బాసిల్ థంపి బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రతీ మ్యాచ్‌లో దాదాపుగా 10 కంటే ఎక్కువ శాతం ఎకానమీతో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. వేలంలో బౌలర్లపై ముంబై ఫోకస్ చేయలేదని.. ఈ కారణం చెప్పకనే చెబుతోంది.

బలహీనపడ్డ స్పిన్ విభాగం:

ఐపీఎల్‌లో స్పిన్నర్స్ కంటూ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ మ్యాచ్‌లో స్పిన్నర్లు అవసరమైన సమయాల్లో వికెట్లు తీసి.. విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్పిన్నర్లదే హావా కొనసాగుతోంది. యుజ్వేంద్ర చాహల్ తన ఖాతాలో 11 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 10 వికెట్లు తీశాడు. ఇక ముంబై స్పిన్ బౌలర్ మురుగన్ అశ్విన్.. ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడి 7.70 ఎకానమీతో ఐదు వికెట్లు తీశాడు. కానీ జట్టు విజయాల్లో మాత్రం కీలక పాత్ర పోషించలేకపోతున్నాడు. మెగా వేలంలో స్పిన్నర్లపై ముంబై ప్రత్యేక దృష్టి పెట్టలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం.

కీరన్ పొలార్డ్ వైఫల్యం:

టీ20 ఫార్మాట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్ ఒకడు. ముంబై ఇండియన్స్ పొలార్డ్‌ను ‘రిటైన్’ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి 5 మ్యాచ్‌లలోనూ పొలార్డ్ నిరాశపరిచాడు. కేవలం 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పొలార్డ్‌ను రిప్లేస్ చేయగలిగే ఆల్ రౌండర్‌పై ముంబై అస్సలు దృష్టిపెట్టలేదు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!