AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs GT Highlights: నాలుగో విజయం నమోదు చేసిన గుజరాత్.. 37 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గెలుపు..

RR vs GT: ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్(GT), రాజస్తాన్‌ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.

RR vs GT Highlights: నాలుగో విజయం నమోదు చేసిన గుజరాత్.. 37 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గెలుపు..
Ipl
Narender Vaitla
| Edited By: Srinivas Chekkilla|

Updated on: Apr 14, 2022 | 11:28 PM

Share

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్(GT), రాజస్తాన్‌ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. 193 పరుగుల విజయలక్ష్యంతో ఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

Key Events

బౌలింగ్‌ రాజస్థాన్‌ బలం..

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో బౌలర్లు మంది ఆటతీరును కనబరుస్తున్నారు. ముఖ్యంగా ట్రెంట్‌ బౌల్డ్‌, ప్రసిద్ధ్‌ కృష్ట, కుల్దీప్‌ సేన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు.

పటిష్టంగా గుజరాత్‌ బ్యాటింగ్‌..

గుజరాత్‌ జట్టులో బ్యాట్స్‌మెన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. శుభ్‌మన్‌ గిల్‌ నిలకడగా రాణిస్తున్నాడు. కెప్టెన్‌ పాండ్యా కూడా పరుగులు సాధిస్తున్నాడు. దీంతో గుజరాత్‌ టీమ్‌ బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 14 Apr 2022 11:24 PM (IST)

    9వ వికెట్ కోల్పోయిన రాజస్తాన్

    రాజస్తాన్ రాయల్స్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

  • 14 Apr 2022 11:14 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన రాజస్తాన్

    రాజస్తాన్ రాయల్స్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన నీషమ్ ఔటయ్యాడు

  • 14 Apr 2022 11:07 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్‌

    రాజస్తాన్ రాయల్స్ ఏడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన పరాగ్‌ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 14 Apr 2022 10:49 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన రాజస్తాన్

    రాజస్తాన్ రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. శిమ్రన్ హెట్మేయర్ ఔటయ్యాడు.

  • 14 Apr 2022 10:36 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన రాజస్తాన్

    రాజస్తాన్ రాయల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. డస్సెన్‌ కీపర్ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 14 Apr 2022 10:12 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్తాన్‌

    రాజస్తాన్‌ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది.  కెప్టెన్ సంజ్‌ శాంసన్‌ రనౌట్‌ అయ్యాడు.

  • 14 Apr 2022 10:03 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్‌

    రాజస్తాన్‌ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది.  54 పరుగులు చేసిన బట్లర్ పెవిలియన్ చేరాడు.

  • 14 Apr 2022 10:02 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన బట్లర్

    రాజస్తాన్ ఓపెనర్ బట్లర్ హాఫ్ సెంచరీ చేశాడు.

  • 14 Apr 2022 09:59 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్

    రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. రవీచంద్రన్ అశ్విన్ ఔటయ్యాడు.

  • 14 Apr 2022 09:43 PM (IST)

    రాజస్థాన్‌కు తొలి దెబ్బ..

    గుజరాత్‌ ఇచ్చిన 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి దేవదత్‌ పడిక్కల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 14 Apr 2022 09:20 PM (IST)

    గుజరాత్‌ భారీ స్కోర్‌..

    టాస్‌ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన గుజరాత్‌, రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు సాధించింది. గుజరాత్‌ టీమ్‌లో హార్ధిక్‌ పాండ్యే 52 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. డేవిడ్‌ మిల్లర్‌ (31), అభినవ్ మనోహర్ (43) పరుగులు సాధించి జట్టు స్కోరును పెంచారు. ఇక రాజస్థాన్‌ బౌలర్ల విషయానికొస్తే కుల్దీప్‌, చాహల్‌, రియన్‌ పరాగ్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.

  • 14 Apr 2022 09:10 PM (IST)

    పాండ్యాకు తోడైన మిల్లర్‌..

    గుజరాత్‌ స్కోర్‌ దూసుకుపోతోంది. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన కెప్టెన్‌ పాండ్యాకు తోడిగా డేవిడ్‌ మిల్లర్‌ చేరాడు. వీరిద్దరి పాట్నర్‌షిప్‌ కేవలం 17 బంతుల్లోనే 32 పరుగులు సాధించారు. ప్రస్తుతం గుజరాత్‌ స్కోర్‌ 19 ఓవర్లు ముగిసే సమయానికి 175 పరగుల వద్ద కొనసాగుతోంది.

  • 14 Apr 2022 08:55 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన గుజరాత్‌..

    భారీ పాట్నర్‌ షిప్‌కు బ్రేక్‌ పడింది. 43 పరుగల వద్ద అభినవ్‌ మనోహర్‌ అవుట్‌ అయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చిన అభినవ్‌ అవుట్ అయ్యాడు.

  • 14 Apr 2022 08:43 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పాండ్యా..

    జట్టు భారాన్ని తనపై వేసుకున్న హార్ధిక్‌ పాండ్యా స్కోరు బోర్డును పరగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లో 50 పరగులు సాధించాడు పాండ్యే.

  • 14 Apr 2022 08:35 PM (IST)

    100 దాటిన గుజరాత్‌ స్కోర్ బోర్డ్‌..

    గుజరాత్‌ స్కోర్‌బోర్డ్‌ సెంచరీ దాటేసింది. హార్ధిక్‌ పాండ్యే, అభినవ్‌ మనోహర్‌ రాణిస్తుండడంతో జట్టు స్కోరు పెరుగుతోంది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్‌ స్కోర్ 101/03 వద్ద కొనసాగుతోంది. క్రీజులో పాండ్యా (42), అభినవ్‌ మనోహర్‌ (31) వద్ద కొనసాగుతోంది.

  • 14 Apr 2022 08:30 PM (IST)

    జట్టు స్కోరు పెంచే పనిలో పడ్డ పాండ్యా..

    వరుసగా మూడు వికెట్లు కోల్పోయి స్కోర్ బోర్డ్‌ వేగంలో వెనుకబడ్డ గుజరాత్‌ టీమ్‌ను కెప్టెన్‌ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హార్థిక్‌ పాండ్యే కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు.

  • 14 Apr 2022 08:20 PM (IST)

    ముగిసిన 10 ఓవర్లు..

    10 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి గుజరాత్‌ 72 పరగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో మనోహర్‌ (10), హార్ధిక్‌ పాండ్యా (35) వద్ద కొనసాగుతున్నారు.

  • 14 Apr 2022 08:05 PM (IST)

    కీలక వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..

    గుజరాత్‌ మరో వికెట్‌ను కోల్పోయింది. రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన భుబ్‌మన్‌ గిల్‌ హెట్‌మెయర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. శుభ్‌మన్‌పై భారీ ఆశలు పెట్టుకున్న గుజరాత్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

  • 14 Apr 2022 07:45 PM (IST)

    గుజరాత్‌కు మరో దెబ్బ..

    గుజరాత్‌ మరో వికెట్‌ను కోల్పోయింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చిన విజయ్‌ శంకర్‌ అవుట్‌ అయ్యాడు.

  • 14 Apr 2022 07:41 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..

    గుజరాత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. మాథ్యూ వెడ్‌, దుస్సేన్ చేతిలో రన్‌ అవుట్ రూపంలో పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 14 Apr 2022 07:22 PM (IST)

    ఇరు జట్లు..

    రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/ కెప్టెన్), దుస్సేన్, సిమ్రాన్ హెట్‌మెయర్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, ప్రసీద్ కృష్ణ, యుజ్వేందర్‌ చాహల్

    గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వెడ్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యశ్ దయాల్

  • 14 Apr 2022 07:06 PM (IST)

    టాస్‌ గెలిచిన రాజస్థాన్‌..

    టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. పిచ్‌ చేజింగ్ అనుకూలిస్తుండడంతో పటేల్‌ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఈ నిర్ణయం రాజస్థాన్‌ను విజయ తీరాలకు చేరుస్తుందేమో చూడాలి.

Published On - Apr 14,2022 7:04 PM