Bank Transaction: తప్పుడు ఖాతాకు పొరపాటున డబ్బు పంపారా.. ఇలా చేస్తే మీ మనీ బ్యాక్..

Bank Transaction: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో గత కొన్నేళ్లుగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజుల్లో ప్రజలు ఫిజికల్ క్యాష్ కి బదులుగా నెట్ బ్యాంకింగ్, UPI చెల్లింపు, క్రెడిట్ కార్డ్(Debit card), డెబిట్ కార్డ్, ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Bank Transaction: తప్పుడు ఖాతాకు పొరపాటున డబ్బు పంపారా.. ఇలా చేస్తే మీ మనీ బ్యాక్..
Banking
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 14, 2022 | 2:00 PM

Bank Transaction: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో గత కొన్నేళ్లుగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజుల్లో ప్రజలు ఫిజికల్ క్యాష్ కి బదులుగా నెట్ బ్యాంకింగ్, UPI చెల్లింపు, క్రెడిట్ కార్డ్(Debit card), డెబిట్ కార్డ్, ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ సౌకర్యం చాలా ఈజీగా మారింది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవల ద్వారా సెకన్లలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లభించింది. ఈ పద్ధతిలో డబ్బును బదిలీ చేయడం వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. తొందరలో ఉన్నప్పుడు కొన్ని సార్లు పొరపాటున మనం తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటాము. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. మీరు కూడా తొందరపడి ఇలాగే తప్పుడు అకౌంట్ కు డబ్బును బదిలీ చేసినట్లయితే.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీరు కొన్ని సులభమైన మార్గాల్లో మీ డబ్బును తిరిగి పొందవచ్చు. రాంగ్ అకౌంట్ కు డబ్బు బదిలీ అయితే మీరు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు(Credit Card) మొదలైన డిజిటల్ చెల్లింపు పద్ధతిలో డబ్బు బదిలీ చేసేటప్పుడు తప్పుడు ఖాతాకు డబ్బు ట్రాన్ఫర్ చేస్తే.., మీరు ముందుగా మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌ కు కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేయాలి. దీనికి తోడు లావాదేవీల స్క్రీన్ షాట్లను వారికి అందించాలి. ఆ తర్వాత బ్యాంక్ మీ రిక్వెస్ట్ పై చర్యలు తీసుకోవటం ప్రారంభిస్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికైనా డబ్బును బదిలీ చేసినట్లయితే, మీరు బ్యాంక్ ఖాతా నంబర్‌తో పాటు IFSC కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మీ IFSC కోడ్ తప్పుగా ఉన్నట్లయితే, అటువంటి పరిస్థితిలో మీ డబ్బు 24 నుంచి 48 గంటల్లోపు ఖాతాలో తిరిగి జమ అవుతుంది. డబ్బు తిరిగి రాకపోతే మీరు బ్యాంకును సంప్రదించవచ్చు.

మీ డబ్బు తప్పుడు బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తే.. మీరు బ్యాంకు శాఖకు వెళ్లి దాని గురించి సమాచారం ఇవ్వవచ్చు. కానీ.. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే డబ్బును మరొక బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తే.. దానిని తిరిగి పొందడానికి 2 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. డబ్బు తప్పుడు ఖాతాకు బదిలీ అయినప్పుడు.. మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే.. అటువంటి పరిస్థితిలో మీరు న్యాయ సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కోర్టు సహాయంతో మీ డబ్బును తిరిగి పొందవచ్చు. దీనిలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మనం ఎంత త్వరగా దీనిపై స్పందించాము, బ్యాంకుకు ఎంత త్వరగా విషయాన్ని తెలియజేశామన్నదే. అప్పుడే బ్యాంక్ మీకు త్వరితగతిన డబ్బును తిరిగి ఇప్పించేందుకు కుదురుతుంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Post Office: ఈ పథకంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు.. మీ డబ్బుకి పటిష్టమైన భద్రత..!

Deliveroo: హైదరాబాద్ కు అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ యాప్.. ఆ నైపుణ్యాలు ఉన్న వారికి కొత్తగా ఉద్యోగాలు..