AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deliveroo: హైదరాబాద్ కు అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ యాప్.. ఆ నైపుణ్యాలు ఉన్న వారికి కొత్తగా ఉద్యోగాలు..

Deliveroo: ఇప్పటి దాకా మనకు ఫుడ్ డెలివరీ యాప్ లు అంటే జొమాటో, స్విగ్గీ లేదా ఓలా మాత్రమే. కానీ దీనికి తలదన్నే మరో యాప్ ఇండియాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే..

Deliveroo: హైదరాబాద్ కు అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ యాప్.. ఆ నైపుణ్యాలు ఉన్న వారికి కొత్తగా ఉద్యోగాలు..
Deliveroo
Ayyappa Mamidi
|

Updated on: Apr 14, 2022 | 2:08 PM

Share

Deliveroo: ఇప్పటి దాకా మనకు ఫుడ్ డెలివరీ యాప్(Food Delivery Apps) లు అంటే జొమాటో, స్విగ్గీ లేదా ఓలా మాత్రమే. కానీ దీనికి తలదన్నే మరో యాప్ ఇండియాలోకి(India) వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే యూకే ఫుడ్ డెలివరీ దిగ్గజం Deliveroo తన తన అతిపెద్ద ఆఫ్‌షోర్ టెక్ హబ్‌ను హైదరాబాద్ లో ప్రారంభించింది. UK లోని ప్రధాన కార్యాలయం తరువాత హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న హబ్ పెద్దదని కంపెనీ వెల్లడించింది. దీనిని ఏప్రిల్ 12న కంపెనీ ప్రారంభించింది. ఫుడ్ డెలివరీలో సవాలుగా ఉన్న ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించేందుకు సంస్థ ప్రధానంగా పనిచేయనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం 11 దేశాల మార్కెట్లలో 800 లొకేషన్లలో తన సేవలు అందిస్తున్న కంపెనీ అనేక అవార్డులను అందుకుంది. దీని రాకతో హైదరాబాద్ లోని టెక్కీలకు, ప్రజలకు కొత్త అవకాశాలు రానున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ML, AI కొత్త అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఫుడ్ టెక్, క్విక్ కామర్స్, హైపర్ లోకల్ ఫుడ్ కామర్స్ వంటి టెక్నాలజీలను హైదరాబాద్ లీడింగ్ గా నిలుస్తోంది. కంపెనీ రాకతో ఈ రంగంలో రానున్న రోజుల్లో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2022 చివరి నాటికి 1,250 లొకేషన్లలో తమ సేవలను అందిచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త కొలువులు..

2023 నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని కంపెనీ యోచిస్తోంది. లండన్‌లోని ప్రధాన కార్యాలయం వెలుపల అతిపెద్ద ఇంజనీరింగ్ కేంద్రం, కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందడానికి సహకరించనుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కేంద్రం 150 మంది ఇంజనీర్లను కలిగి ఉంటుందని, 2023 నాటికి 300 మందిని ఈ కేంద్రంలో పని చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

“గత మూడు నెలల్లో 20 మంది ఇంజనీర్లను నియమించుకున్నాము. ఈ సంవత్సరం చివరి నాటికి 150 మంది ఇంజనీర్లను నియమించుకునేందుకు మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ ఇంజనీర్లు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ వంటి వాటిపై పని చేస్తారు. హైదరాబాద్ సెంటర్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌లను కూడా నియమించుకోవాలని చూస్తున్నాం’’ అని డెలివరూ ఇండియా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ శశి సోమవరపు వెల్లడించారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఎన్ని ప్రయోజనాలో.. లోన్ ఆఫర్లు, టాక్స్ సేవింగ్స్.. ఇంకెన్నో..

Petrol Diesel Price: వాహానదారులకు గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో..