Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఎన్ని ప్రయోజనాలో.. లోన్ ఆఫర్లు, టాక్స్ సేవింగ్స్.. ఇంకెన్నో..
Electric Vehicles: గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో మక్కువ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రో రేట్ర(Petrol Prices) నుంచి స్వాంతన పొందేందుకు చాలా మంది కొద్దిగా ఖరీదైనప్పటికీ ఎలక్ట్రిక్ వాహనం కొనాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారికి ప్రస్తుతం చాలా ప్రయోజనాలు లభిస్తున్నాయి.
Electric Vehicles: గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో మక్కువ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రో రేట్ర(Petrol Prices) నుంచి స్వాంతన పొందేందుకు చాలా మంది కొద్దిగా ఖరీదైనప్పటికీ ఎలక్ట్రిక్ వాహనం కొనాలని అనుకుంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సైతం ప్రోత్సాహకాలు అందించటం చాలా మందిని అటుగా అడుగులు వేసేలా చేస్తోంది. దీనిని ప్రోత్సహించేందుకు బ్యాంకులు(Bank loans) కూడా మంచి ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకుంటున్న వారికి ఆకర్షనీయంగా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ట్రెండ్ చూస్తుంటే రానున్న కాలంలో ఎక్కువ శాతం మంది వీటివైపు మెుగ్గు చూపుతారని నిపుణులు అంటున్నారు. దేశంలో ఈ-వాహనాల మొత్తం విక్రయాలు 2021-22లో మూడు రెట్లు పెరిగి 4,29,217 యూనిట్లకు చేరుకున్నాయి. 2020-21లో వీటి అమ్మకాలు 1,34,821 యూనిట్లుగా ఉన్నాయి.
వివిధ బ్యాంకులు ఇస్తున్న లోన్ ఆఫర్లు..
గ్రీన్ లోన్ పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాదారులకు లోన్ సౌకర్యాన్ని అందిస్తోంది. E-వాహనాలపై ప్రజల ఆసక్తిని పెంచేందుకు, SBI బ్యాంక్ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ కార్ లోన్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద వాహన ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాన్ని అందిస్తోంది. 7.05 శాతం నుంచి 7.75 శాతం వడ్డీకే ఈ రుణాన్ని అందిస్తోంది.
ప్రభుత్వ రంగానికి చెందిన మరో ప్రసిద్ధ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank Of India) సైతం యూనియన్ గ్రీన్ మైల్ పేరుతో ఎలక్ట్రిక వాహనాలు కొనాలనుకునే వారికి రుణాలను అందిస్తోంది. అది కూడా ఆకర్షణీయమైన రేటుకే లోన్ ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనేందుకు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు బ్యాంక్ లోన్ అందిస్తోంది. 84 నెలల కాల వ్యవధితో లోన్ అందిస్తున్నప్పటికీ.. టూవీలర్లకు మాత్రం 36 నెలల కాలానికి మాత్రమే రుణాన్ని అందిస్తోంది. ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ సైతం ఈవీలకు రుణాలను అందిస్తోంది. వాహన ఆన్ రోడ్ ధరలో 85 శాతం వరకు లోన్ అందిస్తోంది. ఇందుకోసం గరిష్ఠంగా ఏడు సంవత్సరాల కాల పరిమితితో లోన్ ఆఫర్ చేస్తోంది.
టాక్స్ సేవింగ్స్ కూడా..
ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనేందుకు ఏదైనా బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటే.. దానిపై చెల్లించే వడ్డీ విషయంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 88EEB కింద ఆదాయపన్ను శాఖ ఈ వెసులు బాటును అందిస్తోంది. దీనికి తోడు రాష్ట్రాల్లో రోడ్డు పన్ను, ఈ-వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మాఫీ అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి..
SEBI: ఆ విషయంలో స్టాక్ ఎక్ఛ్సేంజీల నిర్లక్ష్యంపై సెబీ సీరియస్.. BSE-NSE లపై జరిమానా..
Auto Sales: భారీగా పడిపోయిన ద్విచక్ర వహనాల అమ్మకాలు.. 10 ఏళ్ల కనిష్ఠానికి ఎందుకంటే..