SEBI: ఆ విషయంలో స్టాక్ ఎక్ఛ్సేంజీల నిర్లక్ష్యంపై సెబీ సీరియస్.. BSE-NSE లపై జరిమానా..
SEBI: దేశీయ ఈక్విటీ స్టాక్ ఎక్ఛ్సేంజీలైన BSE-NSE లపై క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) సీరియస్ అయింది. ఆ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు BSE-NSE లపై జరిమానా విధించింది.
SEBI: దేశీయ ఈక్విటీ స్టాక్ ఎక్ఛ్సేంజీలైన BSE-NSE లపై క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) పెనాల్టీ విధించింది. హైదరాబాద్ కు చెందిన బ్రోకరేజ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ స్కామ్ విషయంలో సెబీ ఈ చర్యలు తీసుకుంది. ఖాతాదారులకు సంబంధించిన రూ. 2,300 కోట్ల విలువైన సెక్యూరిటీలను కార్వీ బ్రోకరేజ్ దుర్వినియోగం చేయకుండా స్టాక్ ఎక్ఛ్సేంజీలు సకాలంలో చర్యలు తీసుకోలేదని సెబీ వెల్లడించింది. విచారణలో అలసత్వం వహించినందుకు గాను BSEపై రూ.3 కోట్లు, NSEపై రూ.2 కోట్లు జరిమానా విధించింది.
అసలు కార్వీ వివాదం ఏంటంటే..
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తమ క్లయింట్‌లకు సంబంధించిన సెక్యూరిటీలను దుర్వినియోగం చేసి భారీ కుంభకోణానికి పాల్పడింది. ఖాతాదారుల డీమ్యాట్ అకౌంట్ల నుంచి షేర్లను వారికి తెలియకుండా కంపెనీ ఖాతాల్లోకి మళ్లించింది. కార్వీ ద్వారా షేర్లు కొని దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం అలాగే ఉంచేసిన దాదాపు 95 వేల డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను అక్రమంగా బదలాయింపు చేసుకుంది కార్వీ సంస్థ. వాటిని సొంత షేర్లుగా చూపి బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి రూ. 2,873 కోట్ల రుణాలుగా పొందింది.
ఎక్కువ కాలం పాటు పట్టించుకోకుండా వదిలేసిన దాదాపు 95 వేలకు పైగా డీమాట్ ఖాతాల్లోని షేర్లను అక్రమ పద్దతుల్లో తమ ఖాతాలోకి బదలాయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాదు ఆ షేర్లను సొంత షేర్లుగా బ్యాంకులను నమ్మించడంతో పాటు, వాటిని తనఖా పెట్టి దాదాపుగా రూ. 2,873 కోట్ల రుణాలు పొందారు. ఈ కేసులో ఎన్‌ఎస్‌ఈ, బిఎస్‌ఈ లతో (BSE and NSE) పాటు సెబి జూన్ 2019 నుంచి దర్యాప్తు ప్రారంభించింది. NSE ఇందుకోసం ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించింది. నవంబర్ 2019లో SEBIకి ప్రాథమిక నివేదికను దాఖలు చేసింది. ఈ నివేదిక ఆధారంగా సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం NSE పర్యవేక్షణలో సెక్యూరిటీలను బదిలీ చేయాలని డిపాజిటరీలను SEBI ఆదేశించింది. దీంతో అసలు యజమానుల ఖాతాలకు సెక్యూరిటీల తిరిగి బదలాయింపు జరిగింది. NSE నవంబర్ 2020లో కార్వీ ఇన్వెస్టర్ల రూ. 2300 కోట్ల విలువైన సెక్యూరిటీలు, ఫండ్‌లు సెటిల్ అయ్యాయని తెలిపింది.
The two orders lay bare of how #Karvy exploited loopholes and how the scam escaped regulator’s scrutiny. These two statements by exchanges in their defence are gems. #NSE acted as ‘informant’, ‘unreasonable’ to expect #BSE will analyse sheer volume of data pic.twitter.com/VIR78DMXJQ
— Jayshree P Upadhyay (@jaysh88) April 13, 2022
ఇవీ చదవండి..
Auto Sales: భారీగా పడిపోయిన ద్విచక్ర వహనాల అమ్మకాలు.. 10 ఏళ్ల కనిష్ఠానికి ఎందుకంటే..
Cash Back: క్యాష్ బ్యాక్ వలలో చిక్కుకోకండి.. ఈ జాగ్రత్తలు పాటించండి..