AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Sales: భారీగా పడిపోయిన ద్విచక్ర వహనాల అమ్మకాలు.. 10 ఏళ్ల కనిష్ఠానికి ఎందుకంటే..

Auto Sales: దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, కరోనా మిగిల్చిన ఆర్థిక కుదేలుతో వాహన రంగం తీవ్రంగా ప్రభావితమైంది. పడిపోయిన వాహన అమ్మకాలు దీనికి అద్దంగా నిలుస్తున్నాయి. టూవీలర్ అమ్మకాలు మాత్రం భారీగా పడిపోయాయి.

Auto Sales: భారీగా పడిపోయిన ద్విచక్ర వహనాల అమ్మకాలు.. 10 ఏళ్ల కనిష్ఠానికి ఎందుకంటే..
Auto Sector
Ayyappa Mamidi
|

Updated on: Apr 14, 2022 | 2:09 PM

Share

Auto Sales: దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, కరోనా మిగిల్చిన ఆర్థిక కుదేలుతో వాహన రంగం తీవ్రంగా ప్రభావితమైంది. పడిపోయిన వాహన అమ్మకాలు దీనికి అద్దంగా నిలుస్తున్నాయి. ప్యాసింజర్ వాహన(Passenger Vehicles) అమ్మకాలు భారీగా క్షీణించాయి. మార్చి ఒక్క నెలలోనే 4 శాతం మేర క్షీణించి.. 2.79 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలలో 2.90 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయని వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్గనైజేషన్ సియామ్ వెల్లడించింది. టూవీల్ వాహనాలకు(Two Eheelers) గ్రామీణ ప్రజల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు  ఎలా ఉన్నాయనే విషయం ప్రస్తుతం దిగజారిన వాహన అమ్మకాలు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు కూడా దీనికి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది.

గణాంకాల ప్రకారం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఇవి ఏకంగా 21 శాతం క్షీణించాయి. గత సంవత్సరం మార్చి నెలలో 14.96 లక్షలుగా నిలిచాయి. తాజాగా.. ఈ సంవత్సరం మార్చిలో 11.84 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. గత పదేళ్ల కాలంలో ఇదే కనిష్ఠ స్థాయిగా నిలిచింది. వార్షిక ప్రాతిపదికన ఈ మార్చి నెలలో టూవీలర్ విక్రయాలు 9,93,996 యూనిట్ల నుంచి 7,86,479 యూనిట్లకు తగ్గాయి. స్కూటర్ అమ్మకాలు 4,58,122 యూనిట్లుగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 13 శాతం మేర పెరిగి 30,69,499 యూనిట్లుగా నమోదయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ వాహన విక్రయాలు 27,11,457 యూనిట్లుగా ఉన్నాయి.

త్రివీలర్ అమ్మకాల విషయానికి వస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో 2,60,995 యూనిట్లుకు పెరిగాయి. మునపటి ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు 2,19,446 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో కమర్షియల్ వాహన అమ్మకాలు 5,68,559 యూనిట్ల నుంచి 7,16,556 యూనిట్లకు పెరిగాయి. మొత్తం వాహన అమ్మకాలను గమనిస్తే.. 2020-21లో 1,86,20,233 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరంలో 1,75,13,596 యూనిట్లకు తగ్గాయి. ఈ గణాంకాల ప్రకారం ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు చిప్ కొరత ఆటోరంగాన్ని మరింతగా కుదేలయ్యేలా చేస్తున్నాయి. వాహనాల అమ్మకాలు 2018-19 నాటి కంటే తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Cash Back: క్యాష్ బ్యాక్‌ వలలో చిక్కుకోకండి.. ఈ జాగ్రత్తలు పాటించండి..

Economic crisis: శ్రీలంకను మించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ మూడు దేశాలు.. ఎందుకంటే..