AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు బ్యాంకులకు సెలవులు.. నిలిచిపోయిన సేవలు..

Bank Holidays in April: బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే.. రెండు రోజులు ఆగక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో గురువారం, శుక్రవారం, ఆదివారం మూడు రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు బ్యాంకులకు సెలవులు.. నిలిచిపోయిన సేవలు..
Bank
Shaik Madar Saheb
|

Updated on: Apr 14, 2022 | 9:00 AM

Share

Bank Holidays in April: బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే.. రెండు రోజులు ఆగక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో గురువారం, శుక్రవారం, ఆదివారం మూడు రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ నాలుగు రోజుల్లో శనివారం మాత్రమే బ్యాంకులు తెరుచుకోనున్నాయి. అత్యవసర పనులుంటే.. శనివారం చేసుకోవాలని లేకపోతే.. లావాదేవీలను సోమవారం వరకు వాయిదా వేసుకోవాలని పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు నుంచి (ఏప్రిల్ 14) ఏప్రిల్ 17 వరకు బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో.. అక్కడ జరుపుకోనున్న పండుగలు, ప్రత్యేక రోజుల బట్టి సెలవులు ప్రకటించారు.

ప్రాంతాల వారీగా బ్యాంకుల సెలవులు

ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్.. మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాలలో ఈ రోజు బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.

ఏప్రిల్ 15: గుడ్ ఫ్రైడే, బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే.. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ మినహా మిగతా రాష్ట్రాల్లో ఏప్రిల్ 15న బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 16: బొహాగ్ బిహు పండుగ.. అస్సాంలో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 17: ఆదివారం.. అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులకు సెలవు.

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఈ 15 రోజులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల్లో పండుగలు, ప్రత్యేక రోజుల ప్రకారం ఉంటాయి.

Also Read:

AP News: అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. గ్యాస్ లీకేజీతో ఎగిసిపడ్డ మంటలు.. ఆరుగురు దుర్మరణం

YS Jagan: అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. బాధితుల కుటుంబాలకు పరిహారం

Ambedkar Jayanti 2022: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. హక్కుల కోసం గొంతెత్తిన స్వరం.. భీమ్‌రావ్ అంబేద్కర్

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత