IMD Weather Update: రైతులకు చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక ఎప్పుడంటే.!

ఒకవైపు భగభగ మండే సూర్యుడి తాపం.. మరోవైపు ఉక్కపోతలు.. ఈ రెండింటితో అల్లాడిపోతున్న జనాలకు, వర్షాల కోసం ఎదురు చూసే రైతులకు..

IMD Weather Update: రైతులకు చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక ఎప్పుడంటే.!
Rain
Follow us

|

Updated on: Apr 14, 2022 | 1:57 PM

ఒకవైపు భగభగ మండే సూర్యుడి తాపం.. మరోవైపు ఉక్కపోతలు.. ఈ రెండింటితో అల్లాడిపోతున్న జనాలకు, వర్షాల కోసం ఎదురు చూసే రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజన్ ఉంటుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల వర్షాలు ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే ఉంటుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల కాలానుగుణ వర్షపాతం దీర్ఘకాల సగటు(LPA)లో ఈ ఏడాది 96 నుండి 104 శాతం మేర వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ గురువారం ఓ కీలక ప్రకటనలో వెల్లడించింది.

జూన్ నెలలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని.. అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా, గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు జూన్‌ నుంచి సెప్టెంబర్ వరకు ఉండగా.. అప్పుడు కూడా సాధారణ వర్షపాతమే నమోదైంది. సాధారణ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?